
పాఠశాలల బలోపేతానికి కృషి అభినందనీయం
బాల్కొండ : రాజకీయాలతో సంబంధం లేకుండా సేవా దృక్పథంతో ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి పారిశ్రామికవేత్త ఏనుగు దయానంద్‌రెడ్డి చేస్తు న్న కృషి అభినందనీయమని మాజీ మంత్రి, ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన దయానంద్‌రె డ్డి సేవారంగంలో ఆదర్శప్రాయుడని కొనియాడా రు. దయానంద్‌రెడ్డి ఉచితంగా 40 ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేసిన క్రీడా సామగ్రిని ఎమ్మెల్యే ఆదివారం మండల కేంద్రంలో విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్ప న కోసం దయానంద్‌రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని, ఆయన తనకు వియ్యంకుడు కావడం అదృష్టమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన టీ–వర్క్స్ కోసం రూ. 2.5 కోట్లతో మిషన్‌ను కొనుగోలు చేసి ఇచ్చిన గొప్ప వ్యక్తి అని అన్నారు. సంపన్నులు ఆయనను ఆదర్శంగా తీసుకుని సేవారంగంలో ముందుకు రావాలని కోరారు. తనవంటి వారు రాజకీయాల్లోకి వచ్చి చెడిపోయామని బాధపడుతున్నామని, ఎలాంటి రాజకీయాలు లేకుండా దయానంద్‌రెడ్డి మాదిరిగా సేవ చేస్తే ఎంతో సంతృప్తి ఉండేదన్నారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి గంగాధర్, పీడీ రాజ్‌కు మార్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, నాయకులు దాసరి వెంకటేశ్, శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.