
నిత్యవసర సరుకుల పంపిణీ
ధర్పల్లి/సిరికొండ : వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న మండలంలోని వాడి గ్రామస్తులకు వర్ష, ప్రమీల, ప్రవీణ్ ల సహకారంతో వందమంది కుటుంబాలకు ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సై కల్యాణి నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు. వారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామంలో దాతలు అందించిన విరాళాలతో కొనుగోలు చేసిన సరుకులను 70 కుటుంబాలకు అందజేశారు. కొండూర్ గ్రామంలోని బాధితులకు మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన కాంట్రాక్టర్ రాములు రూ. 25 వేలు అందించారు. ధర్పల్లి మండలం ప్రాజెక్టు రామడుగు గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో బాధితులకు ఒక రోజుకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు. చీమన్‌పల్లి శివబాలాజీ ట్రేడర్స్, సిరికొండ రాజరాజేశ్వర ట్రేడర్స్ కలిపి పది వేలు, చీమన్‌పల్లి గ్రామస్తులు ఏడు ఆయిల్ ప్యాకెట్ల కాటన్లు నిత్యావసర వస్తువులు, 25 కిలోల పప్పు, ధర్పల్లికి చెందిన గణేష్ మండలి వారు బాధితులకు ఒక పూట భోజనం, చిన్నవాల్గోట్‌కు చెందిన రొండ్ల సంతోష్‌రెడ్డి 15 చీరలు బాధితులకు అందజేశారు.