
ప్రతి రైతునూ ఆదుకుంటాం
రెంజల్/నవీపేట: వర్షాలు, వరదలతో పంట నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, ప్రభు త్వం ద్వారా నష్టపరిహారం అందజేస్తామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. రెంజల్, నవీ పేట మండలాల్లోని తాడ్‌బిలోలి, బోర్గాం, నీలా, కందకుర్తి, మిట్టాపూర్, అల్జాపూర్, యంచ, కోస్లి గ్రామాల్లో ముంపునకు గురైన పంటలను సోమవా రం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల వరద బాధితులు, రైతులతో మాట్లాడారు. వరద ఉధృతికి భయపడొద్దని ధైర్యం చెప్పారు. ప్రతి వర్షాకాలంలో గోదావరి పరీవారక ప్రాంతాలవాసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం సుదర్శన్‌రె డ్డి మీడియాతో మాట్లాడుతూ వరద ఉధృతికి నష్ట పోయిన వారి వివరాలు పక్కాగా సేకరించాలని అ ధికారులకు సూచించారు. దెబ్బతిన్న రోడ్లు, ట్రా న్స్‌ఫార్మర్లు, కాల్వలకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని తెలిపా రు. విద్యుత్ పునరుద్ధరణ పనులను వేగవంతం చే యాలని ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఉర్దూ అకాడ మీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, డీఏవో గోవింద్, ఆర్డీవో రాజేంద్రకుమార్, కాంగ్రెస్ పార్టీ రెంజల్ అధ్యక్షుడు మొబీన్‌ఖాన్, నాయకులు ధనుంజయ్, రాములు, సాయరెడ్డి, నితిన్, పోచయ్య, ఖుద్దూస్, కార్తిక్, జావిద్ తదితరులు పాల్గొన్నారు.
నష్టం వివరాలు పక్కాగా సేకరించాలి
సహాయక చర్యలు ముమ్మరం చేయాలి
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యే, కలెక్టర్