
ఓపీఎస్‌ను అమలు చేయాలి
● కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన
నిజామాబాద్‌అర్బన్: సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని టీఎన్జీవోస్ జిల్లా అ ధ్యక్షుడు సుమన్ డిమాండ్ చేశారు. పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ కలెక్టరేట్ ఎదుట సోమవారం టీఎన్జీవోస్, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో నల్లబ్యాడ్జీ లు, నల్ల దుస్తులు ధరించి నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ ప్రవేశం మార్గం వద్ద బైఠాయించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ భూతాన్ని అంతం చేసే వరకు నిరసన కార్యక్రమాలు చేపడతామ ని పేర్కొన్నారు. అనంతరం ఉద్యోగులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు. కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ జిల్లా కో చైర్మన్లు రమణారెడ్డి, సురేశ్ కృష్ణారెడ్డి, శ్రీనివాస్, మోహన్ రెడ్డి, టీఎన్జీవోస్ అసోసియేట్ అధ్యక్షుడు పెద్దోళ్ల నాగరాజ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెనిగళ్ల సురేశ్, బీసీటీయూ జిల్లా అధ్యక్షుడు మాడవేటి వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.