
క్యాంపస్‌లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు
తెయూ(డిచ్‌పల్లి): టీజీ లాసెట్–2025 కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ పొందిన విద్యార్థులు సోమవారం తెయూ న్యాయ కళాశాలలో చేరేందుకు క్యాంపస్‌కు వచ్చారు. తెయూ ఏబీవీపీ కమిటీ, ఎన్‌ఎస్‌యూఐ కమిటీల ఆధ్వర్యంలో లాసెట్ విద్యార్థులకు సహాయం కోసం వేర్వేరుగా హెల్ప్‌డెస్క్‌లను ఏర్పాటు చేసి వారికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఏబీవీపీ లా కన్వీనర్ శివకుమార్‌రెడ్డి, కోకన్వీనర్ విజయ్, ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడు చౌదరపల్లి మహేశ్, ఉపాధ్యక్షులు అరుణ్ తేజ, జనార్దన్, కార్యదర్శి అనిల్, అలియాస్ తదితరులు పాల్గొన్నారు.

క్యాంపస్‌లో హెల్ప్‌డెస్క్‌ల ఏర్పాటు