క్రైం కార్నర్‌ | - | Sakshi
Sakshi News home page

క్రైం కార్నర్‌

Sep 2 2025 6:48 AM | Updated on Sep 2 2025 6:48 AM

క్రైం

క్రైం కార్నర్‌

ప్రమాదవశాత్తు నీట మునిగి ఒకరి మృతి

వర్ని: మోస్రా మండలం తిమ్మాపూర్‌కు చెందిన వడ్ల అశోక్‌ (35)చింతకుంట చెరువులో తూము వద్ద ఇసుక బస్తాలు వేస్తూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందినట్లు వర్ని ఎస్సై మహేశ్‌ తెలిపారు. చెరువు తూము నుంచి నీరు వృథాగా పోతున్నందున కట్టడి చేసేందుకు సోమవారం ఇసుక బస్తాలు వేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందినట్లు ఎస్సై పేర్కొన్నారు.

చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి ..

రెంజల్‌: మండల కేంద్రంలో ఓ వాహనం ఢీ కొన్న ఘటనలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రెంజల్‌ ఎస్సై చంద్రమోహన్‌ సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఆదివారం రాత్రి వీరన్నగుట్ట నుంచి సాటాపూర్‌ వైపు నడుచుకుంటు వస్తున్న ఓ యువకుడిని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు అంబులెన్స్‌లో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ సదరు వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రభుత్వ ఆస్పత్రిలో..

ఖలీల్‌వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు మూడో టౌన్‌ ఎస్సై హరిబాబు సోమవారం తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మూడో టౌన్‌ పీఎస్‌ పరిధిలో జూలై 20న ఓ వ్యక్తి అపస్మారకస్థితిలో ఉన్నట్లు గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమయంలో సదరు వ్యక్తి తన పేరును సురేశ్‌గా చెప్పినట్లు ఎస్సై తెలిపారు. ఆగస్టు 14న గుండెపోటుతో మృతి చెందాడన్నారు. నాటి నుంచి మృతదేహం కోసం ఎవరూ రాలేదని తెలిపారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659739, 8712551734 నంబర్లకు సమాచారం అందించాలని ఎస్సై కోరారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

ఖలీల్‌వాడి: నగరంలోని ఆరవ టౌన్‌ పీఎస్‌ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైటన్లు ఎస్సై వెంకట్రావు సోమవారం తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 40 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. మృతుడి ఒంటిపై క్రీమ్‌ కలర్‌ డబ్బాల షర్ట్‌, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నాడని, షర్ట్‌ కాలర్‌పై క్లాసిక్‌ టైలర్స్‌, నవీపేట్‌ అని ఉందన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712659848, 8712659734 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

ఏడు లారీలు సీజ్‌

ఆర్మూర్‌ టౌన్‌: మండలంలోని గోవింద్‌పేట్‌లో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఏడు లారీలను సీజ్‌ చేసినట్లు ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్‌ సోమవారం తెలిపారు. భీమ్‌గల్‌ మండలం బెజ్జోరా గ్రామం వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో గోవింద్‌పేట్‌లో లారీలను పట్టుకొని సీజ్‌ చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

క్రైం కార్నర్‌1
1/2

క్రైం కార్నర్‌

క్రైం కార్నర్‌2
2/2

క్రైం కార్నర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement