
ఆంగ్ల విభాగంలో హేమలతకు డాక్టరేట్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగం పరిశోధక విద్యార్థి ఎల్‌టీ హేమలత డాక్టరేట్ సాధించారు. తెయూ అసిస్టెంట్ పి.సమత పర్యవేక్షణలో‘సైకలాజికల్ యాస్పెక్టస్ ఇన్‌ద సె లెక్ట్ నావెల్స్ ఆఫ్ అనిత నాయర్’ అనే అంశంపై హేమలత సిద్ధాంత గ్రంథం సోమవారం సమర్పించారు. పీహెచ్‌డీ డాక్టరేట్ సాధించిన హేమలతను వీసీ, రిజిస్ట్రార్‌తో పాటు పలువురు అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో ఆర్ట్స్ డీన్ లా వ ణ్య,హెచ్‌వోడీ కేవీ రమణచారి, అధ్యాపకులు స్వా మి,పరిశోధక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
● సీపీ సాయిచైతన్య
ఖలీల్‌వాడి: రక్తదానం ఎంతో గొప్పదని సీపీ సాయిచైతన్య అన్నారు. ఇండియన్ ఆయిల్ డే వార్సికోత్సం సందర్భంగా నిజామాబాద్ పోలీస్ ఫిల్లింగ్ స్టేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్వచ్ఛంద రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరానికి సీపీ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని, రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలను రక్షించిన వారిమవుతామని అన్నారు. కార్యక్రమంలో ఐవోసీఎల్ అధికారి పూర్ణచంద్రరావు, ఆర్‌ఐ సీఐ తిరుపతి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పెర్కిట్: ఆలూర్ మండలం మిర్దాపల్లిలో గ్రామ దేవతల ఆలయాల ఎదుట పిల్లులను బలి ఇచ్చిన ఘటన కలకలం రేకేత్తిస్తోంది. గ్రామంలోని గ్రామ దేవతలతో పాటు గణేశ్ మండపం ఎదుట పిల్లులను బలి ఇచ్చిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. గ్రామస్తులు సోమవారం తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తు తెలియని దుండగులు గ్రామంలోని నాలుగు గ్రామ దేవతల ఆలయ ఎదుట పిల్లులను హతమార్చి బలి ఇచ్చారు. అలాగే గ్రామంలో చిన్న పిల్లలు ఏర్పాటు చేసిన గణేశ్ మండపం వద్ద సైతం పిల్లిని బలి ఇచ్చారు. గుర్తు తెలియని వ్యక్తులు పిల్లులను బలి ఇవ్వడంపై గ్రామంలో ఏదైన అరిష్టం జరగవచ్చని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై వీడీసీ వారు ఆర్మూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆంగ్ల విభాగంలో హేమలతకు డాక్టరేట్