
నేవీలో ఉద్యోగం సాధించిన యువకుడికి సీపీ అభినందన
డిచ్‌పల్లి: మండలంలోని అమృతాపూర్ గ్రామం ఒడ్డెర క్యాంపు కాలనీకి చెందిన పాలపు శివకుమార్ ఇండియన్ నేవీలో ఉద్యోగం సాధించారు. శివకుమార్ తన తల్లిదండ్రులతో కలిసి సీపీ పోతరాజు సాయి చైతన్యను సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నేవీలో ఉద్యోగం సాధించిన శివకుమార్‌ను సీపీ అభినందించి మిఠాయి తినిపించారు. యువత చెడు మార్గాలకు వెళ్లకుండా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగాన్ని సాధించి తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలన్నారు. శివకుమార్‌ను ఆదర్శంగా తీసుకుని యువత దేశభక్తిని అలవర్చుకోవాలన్నారు. శివకుమార్‌ను ఉన్నతంగా తీర్చిదిద్దిన తల్లిదండ్రులను సీపీ అభినందించారు.
ఆర్మూర్‌టౌన్: పెద్దమ్మ ఆలయ పరిసరాల్లో తిరుగుతున్న చిరుతను త్వరగా పట్టుకోవాలని ముదిరాజ్ సంఘం, ఆలయ కమిటీ సభ్యులు, రైతులు, గొర్ల కాపరులు సోమవారం ఫారెస్ట్ రెంజ్ అధికారి శ్రీనివాస్‌కు విన్నవించారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో గొర్ల కాపరి మందను ఆలయ పరిసరానికి తీసుకువెళ్తున్న సమయంలో చిరుత ఒక మేకను నోట కరిచి గుట్టపై తీసుకెళ్లిందన్నారు. దీంతో తాము ఆ పరిసర ప్రాంతాలకు వెళ్లాలంటేనే భయంగా ఉందన్నారు. అధికారులు త్వరగా బోనులు ఏర్పాటు చేసి చిరుతను పట్టుకోవాలని ఎఫ్‌ఆర్‌వోను కోరారు. ఆలయ కమిటీ చైర్మన్ మచ్చేందర్, జక్కం శేఖర్, బోన్ల గోపి, ప్రసాద్, దేవేందర్, నర్సారెడ్డి, రాజారెడ్డి, గొర్లకాపరులు, రైతులు పాల్గొన్నారు.