
పులాంగ్ బ్రిడ్జి మూసివేత
నిజామాబాద్ సిటీ: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం నగరంలోని వినాయక్‌నగర్‌లోని వంద ఫీట్ల రోడ్డు నుంచి గాయత్రినగర్‌కు వెళ్లే పులాంగ్ వాగు మీది నుంచి వరద ప్రవహిస్తోంది. దీంతో ఈ బ్రిడ్జిని మున్సిపల్ అధికారులు మూసివేశారు.
ఇక సీసీల బదిలీలు
డొంకేశ్వర్(ఆర్మూర్): పేదరిక నిర్మూలన సంస్థ ‘సెర్ప్’లో ఉద్యోగ బదిలీలు చివరి దశకు చేరుకున్నాయి. డీపీఎంలు, ఏపీఎంలకు బదిలీలు పూర్తి కాగా, ఇప్పుడు క్లస్టర్ కో–ఆర్డినేటర్ల (సీసీలు) వంతు వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర సెర్ప్ శాఖ నుంచి ఉత్తర్వులు రాగా, సీనియారిటీ జాబితా జిల్లాకు చేరింది. వాస్తవానికి శుక్రవారమే బదిలీ కౌన్సెలింగ్ జరగాల్సి ఉండగా, వర్షాల కారణంగా శనివారానికి వాయి దా వేశారు. మొత్తం 145 మంది సీసీలకు కలెక్టరేట్‌లో శనివారం కౌన్సెలింగ్ చేపట్టి బదిలీలకు ఉత్తర్వులు జారీ చేయనున్నారు.
విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలి
నిజామాబాద్‌నాగారం: ఽహాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్‌చంద్‌ను స్పూర్తిగా తీసుకొని విద్యార్థులు క్రీడల్లోనూ రాణించాలని డీవైఎస్‌వో పవన్‌కుమార్ అన్నారు. నగరంలోని డీవైఎస్‌వో కార్యాలయంలో శుక్రవారం ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ధ్యాన్‌చంద్ చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం డీవైఎస్‌వో మాట్లాడుతూ.. యువతను, బాలబాలికలను మైదానాలకు తీసుకురావాల్సిన గురుతరమైన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉందన్నారు. చదువుతోపాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్ ఉంటుందన్నారు.
అలాగే క్రీడాకారులకు స్నేహపూర్వకమైన హాకీ టోర్నమెంట్ నిర్వహించారు. జిల్లా సైక్లింగ్ సంఘం ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు నగరంలో విద్యార్థులతో సైకిల్ ర్యాలీని నిర్వహించారు. రిటైర్డు డీవైఎస్‌వో ముత్తెన్న, సిబ్బంది సురేష్, గంగాదాస్, చంద్రశేఖర్, శేఖర్, సత్యనారాయణ, రాష్ట్ర సైకిల్ సంఘం ప్రధాన కార్యదర్శి విజయ్ కాంత్, రవి పబ్లిక్ స్కూల్ పాఠశాల చైర్మన్ సరళ మహేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్యామ్ కుమార్, శ్రీకాంత్ సైకిలింగ్ సంఘం సభ్యులు దుర్గ మల్లేష్ ,ప్రభాకర్, ఆర్ నరేష్ కుమార్ , మురళి రాహుల్ పాల్గొన్నారు.

పులాంగ్ బ్రిడ్జి మూసివేత