
ఆశ్రమంలోని వారిని కాపాడిన రెస్క్యూ బృందం
రెంజల్(బోధన్): గోదావరికి వరద పోటెత్తడంతో కందకుర్తి పుష్కరక్షేత్రంలోని సీతారాం త్యాగి మహారా జ్ ఆశ్రమం చుట్టూ వరద నీరు చేరింది. దీంతో ఆశ్రమంలో స్వామీజీతో పాటు ముగ్గురు శిష్యులు, ముగ్గురు భక్తులు అక్కడే చిక్కుకున్నారు. గురువారం సాయంత్రం బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయ్‌బాబు, ఎస్సై చంద్రమోహన్, తహసీల్దార్ శ్రావణ్‌కుమార్ గ్రామానికి చేరుకుని పరిస్థితులను సమీక్షించారు. వెంటనే రెస్క్యూ బృందాలను రప్పించి ఆశ్రమం వద్దకు పంపించారు. గంటన్నర వ్యవధిలో రెస్క్యూటీం బృందం మహారాజ్ శిష్యులతోపాటు భక్తులను సురక్షితంగా గ్రామానికి చేర్చారు.