
సహాయక చర్యల్లో పోలీసులు
ఖలీల్‌వాడి: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై నీ రు నిలిచింది. ఆయా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్సైలు, సిబ్బంది రోడ్లపై నిలిచిన నీటిని తొ లగించి వాహనాదారులకు అంతరాయం కలగకుండా చేశారు. ఆరో టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని అర్సపల్లి ఎక్స్‌రోడ్డు, నెహ్రూనగర్ రోడ్లపైకి వచ్చిన నీటిని ఎస్సై వెంకట్రావు, సిబ్బంది, స్థానికులు, పొక్లెయిన్ల సాయంతో తొలగించారు. కోర్టు చౌరస్తాలో రోడ్డుపై నీరు నిలవడంతో ట్రాఫిక్ సీఐ ప్రసాద్, ఎస్సై వినోద్, సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకున్నారు. మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవిబాబుకి విషయం తెలిపి ట్రాఫిక్ క్రేన్ సహాయంతో నీటిని మ్యాన్‌హోల్‌లోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు.
బాల్కొండ: కామారెడ్డి జిల్లా కేంద్రం వద్ద జాతీయ రహదారి 44పై గండి ఏర్పడటంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. వాహనాలను దారి మళ్లించడంతో మెండోరా మండలం పోచంపాడ్ నుంచి బాల్కొండ మండలం శ్రీరాంపూర్ వరకు గురువారం ట్రాఫిక్ స్తంభించింది. హైవే పొడువునా 15 కిలోమీటర్ల మేర ట్రక్కులు నిలిచిపోయాయి. వాహనాలను విడతల వారీగా దారి మళ్లించారు. పోచంపాడ్‌జాతీయ రహదారి 44 కూడలి వద్ద ట్రాఫిక్ వన్ వే ఏర్పాటు చేశారు. డ్రైవర్లకు ఆహారం, నీటిని రెవెన్యూ సిబ్బంది, స్థానికులు సమకూర్చారు. ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. మెండోరా, ముప్కాల్, బాల్కొండ పోలీసులు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
నిజామాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో కొనసాగుతున్న కంట్రోల్ రూమ్ పనితీరును కలెక్టర్ టి వినయ్‌కృష్ణారెడ్డి పరిశీలించారు. బు ధవారం సాయంత్రం ఆయన కంట్రోల్ రూ మ్‌ను సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. భా రీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని,ఎలాంటి పరిస్థితి తలెత్తినా,సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని క్షేత్రస్థాయి అధికారులు,సిబ్బందిని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ పరిస్థితిని సమీక్షిస్తోందన్నారు. భారీ వ ర్షాల కారణంగా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తి తే కంట్రోల్ రూమ్ 08462–220183కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.
తెయూ(డిచ్‌పల్లి): నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 29, 30వ తేదీల్లో జరగాల్సిన పీజీ, బీఈడీ, ఎంఈడీ సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ కే సంపత్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వర్షాల కారణంగా వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను తరువాత ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.