
విద్యుత్ పొదుపుపై అవగాహన
ఇందల్వాయి: విద్యుత్ ప్రమాదాల వల్ల జరిగే ఆస్తి, ప్రాణ నష్టాల నివారణకు జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు డీఈ అల్జాపూర్ శ్రీనివాస్ తెలిపారు. నల్లవెల్లిలోని ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులకు విద్యుత్ ప్రమాదాల నివారణ, విద్యుత్ పొదుపు వాడకంపై మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు. ప్రమాదాలను నివారించి, విద్యుత్ పొదుపుని సూచించే కరపత్రాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హెడ్‌మాస్టర్ మాధురి, ఏఈ జ్ఞానేశ్వర్, లైన్‌మన్ నవీన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ గ్రామ శాఖ కార్యవర్గం ఎన్నిక
సిరికొండ: మండలంలోని గడ్కోల్‌లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సంపత్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా చాకలి పెద్ద గంగాధర్ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ లింబాద్రి, భానుచందర్‌రెడ్డి, భాస్కర్, అఖిల్‌యాదవ్, గంగారెడ్డి, గంగాధర్, సుమన్, మనోజ్, సంజీవ్, నవీన్, గంగబాపు తదితరులు పాల్గొన్నారు.