
సమాజ దిక్సూచి.. సాహిత్యం
నిజామాబాద్ అర్బన్: సాహిత్యం సమాజానికి ది క్సూచి వంటిదని, తెలుగు విభాగంలో కొరవి గోప రాజు చేసిన సాహిత్య కృషి ఎంతో అభినందనీయ మని గిరిరాజ్ కళాశాల ప్రిన్సిపాల్ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం కళాశాలలో తెలుగు విభా గం ఆధ్వర్యంలో అవధాన ప్రక్రియ పరిచయం అనే అంశంపై అతిథి ఉపన్యాసం నిర్వహించారు. విద్యార్థులు తమ సామర్థ్యాలను మెరుగుప ర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ రంగరత్నం, తెలుగు విభాగాధిపతి లెఫ్టినెంట్ డాక్టర్ రామస్వామి, ఐక్యూ ఏసీ కో–ఆర్డినేట ర్ రాజేశ్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి వి నయ్ కుమార్, అకాడమిక్ కో–ఆర్డినేటర్ నహేద బే గం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.