
కాలుష్య రహిత సమాజాన్ని అందిద్దాం
● నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా
● జిల్లా కేంద్రంలో
మట్టి గణపతుల పంపిణీ
నిజామాబాద్ రూరల్ : మట్టితో తయారు చేసిన గణనాథులనే పూజిద్దామని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ధన్‌పాల్ లక్ష్మీ బాయి – విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మంగళవారం నగరంలోని ఆకృతి షాపింగ్ మాల్ ఎదుట మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదిహేనేళ్ల నుంచి ట్రస్ట్ ఆద్వర్యంలో మట్టి గణపతులను ఉచింతగా పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. భావితరాలకు కాలుష్య రహిత సమాజాన్ని అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. అనంతరం ఇందూరు వాసులకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కేసీఆర్ కాలనీలో..
నిజామాబాద్ నాగారం : నగరంలోని కేసీఆర్ కాలనీలో వినాయచవితిని పురస్కరించుకొని సాయిహనుమాన్ ఆలయం వద్ద డాక్టర్ పడకంటి రాము, కుమారుడు ఆదిత్య, మిత్రులు కలిసి మట్టి గణపతులను కాలనీవాసులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చంద్రమౌళి, వివేకానందరెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ : మండల కేంద్రంలో కిడ్స్‌పార్క్ పాఠశాల ఆధ్వర్యంలో మట్టి గణపతులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ జాకీర్ హుస్సేన్, హెచ్‌ఎం ఆసిఫ్, కాంగ్రెస్ నాయకులు భాస్కర్‌రెడ్డి, సంతోష్‌నాయక్, ఆసిఫ్, శోభన్, దిగంబర్, ప్రేమ్, మోజీరాం, కిశోర్‌గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాలుష్య రహిత సమాజాన్ని అందిద్దాం