నిజామాబాద్‌నాగారం: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో బుధవారం పై అంతస్తు నుంచి కిందకు వస్తున్న లిఫ్టు మొరాయించింది. లిఫ్టు తలుపులు తెరుచుకోకపోవడంతో అందులో ఉన్న 15 మంది రోగులు, బంధువులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు. సుమారు అరగంటపా టు లిఫ్టులోనే ఉండిపోయారు. రోగులు, బంధువుల ఆర్తనాదాలు విన్న సెక్యూరిటీ, పోలీసులు సిబ్బంది వచ్చి అతికష్టం మీద లిఫ్టు డోర్లు తెరిచారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
8 లిఫ్టుల్లో పనిచేసేవి రెండే..
ఏడు అంతస్తుల జీజీహెచ్‌లో సుమారు 750కి పైగా రోగులు చికిత్స పొందుతుంటారు. నిత్యం 1800 లకు పైగా ఓపీ, 50 నుంచి 100 వరకు ఇన్‌పేషంట్లు వైద్య సేవలు పొందుతారు. జీజీహెచ్‌లో రోగుల కోసం నాలుగు లిఫ్టులు, వైద్యులు, ఇతర అత్యవసరాల నిమిత్తం మరో నాలుగు లిఫ్టులను ఏర్పాటు చేశారు. రోగులకు సంబంధించి లిఫ్టుల్లో రెండు మా త్రమే పనిచేస్తున్నాయి. అవి కూడా అప్పుడప్పుడూ మొరాయిస్తున్నాయి. వైద్యుల లిఫ్టుల్లోనూ రెండు పని చేస్తుండగా వాటిలో ఒకటి రోగులు, బంధువులకు మరొకటి వైద్యులు ఉపయోగిస్తున్నారు.