
బోరు వేయడానికి అనుమతి తప్పనిసరి
సమాచారం
ఖలీల్‌వాడి: బోరు బావి వేయడానికి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. సాగునీటికి సంబంధించిన చట్టాల్లో ప్రధానమైనది వాల్టా చట్టం 2002(వాటర్, ల్యాండ్ అండ్ ట్రీస్). ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ చట్టం అమలులోకి వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత కూడా ఈ చట్టాన్ని యధావిధిగా అమలు చేస్తుంది. వ్యవసాయభూమిలో బోరు వేయడానికి, బావి తవ్వడానికి మండల తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు చేసుకునేందుకు భూగర్భశాఖ అధికారులు వచ్చి అక్కడ నీటి లభ్యత పరిశీలిస్తారు. తర్వాత విద్యుత్ శాఖ నుంచి కరెంట్ సౌకర్యం కల్పించడానికి ఇచ్చిన అనుమతి పత్రాలను వీటితో అందించాల్సి ఉంటుంది. దీని తర్వాత తహసీల్దార్ అనుమతి తీసుకుని బోరు వేయాల్సి ఉంటుంది. లేకుంటే బోరుపై ఫిర్యాదు చేస్తే సీజ్ చేసే అధికారం తహసీల్దార్‌కు ఉంటుంది.