జీడీపీలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌ | - | Sakshi
Sakshi News home page

జీడీపీలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌

Jul 24 2025 7:04 AM | Updated on Jul 24 2025 7:04 AM

జీడీప

జీడీపీలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌

సెస్‌ డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ రేవతి

తెయూ(డిచ్‌పల్లి): అర్థశాస్త్ర అభివృద్ధి పరిధి పెరి గి వేగం పుంజుకోవడంతో దశాబ్ద కాలంలో ప్రపంచస్థాయిలో అత్యధిక జీడీపీ కలిగిన మూ డో అతి పెద్ద దేశంగా భారతదేశం అవతరించిందని సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) డైరెక్టర్‌, ప్రొఫెసర్‌ రేవతి పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఎంపవరింగ్‌ ఇండియా –2047 స్ట్రాటజీస్‌ ఫర్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌’ అ నే అంశంపై బుధవారం ప్రారంభమైన రెండ్రోజు ల జాతీయ స్థాయి ప్రారంభ సదస్సులో ప్రొఫె సర్‌ రేవతి కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుస్థిరాభివృద్ధితో భారత ఆర్థిక విధానాల్లో వచ్చిన చారిత్రాత్మకమైన మార్పులతో ప్రైవేటైజేషన్‌, గ్లోబలైజేషన్‌, లిబరలైజేషన్‌దాటి ఈనాటి డిజిటలైజేషన్‌ వరకు వెళ్లిందన్నారు. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్సీ, బ్లాక్‌ చైన్‌ టె క్నాలజీ, క్లోన్‌ టెక్నాలజీ, సైబర్‌ టెక్నాలజీలు పెరగడంతో పెట్టుబడులకు ఎల్లలు లేకుండా బ హుళ జాతి కంపెనీలు ఉత్పాదకత, ఉత్పత్తిని పెంచుకుంటున్నాని అన్నారు. బ్రాంట్‌ ల్యాండ్‌ కమిషన్‌ మొదలుకొని వికసిత్‌ భారత్‌ వరకు జరిగిన అభివృద్ధి వ్యూహాలను వివరించారు. విశిష్ట అతిథిగా హాజరైన తెయూ వీసీ, ప్రొఫెసర్‌ టీ యాదగిరి రావు మాట్లాడుతూ పటిష్టమైన ఆర్థిక వ్యూహాలే భారత సుస్థిరాభివృద్ధికి మార్గాలన్నా రు. దేశంలోని విస్తారమైన స్థానిక వనరులను ఉపయోగించుకొని ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాన్ని అభివృద్ధిపరిస్తే 2047 నాటికి భారత్‌ ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలబడుతుందన్నారు. రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం యాదగిరి మాట్లాడుతూ 2030 నాటికి మరింత వేగం పెంచుకొని, 2047 నాటికి ప్రపంచంలో 30 ట్రీలియన్ల జీడీపీతో నెంబర్‌ వన్‌ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌ మామిడా ల ప్రవీణ్‌, సదస్సు కన్వీనర్‌, అర్థశాస్త్ర విభాగాధిపతి ఏ పున్నయ్య మాట్లాడుతూ ఈ సెమినార్‌కు అమెరికా, సౌత్‌ కొరియా, బ్రిటన్‌ దేశాల నుంచి ప్రామాణికమైన పత్రాలు అందడం సంతోషంగా ఉందన్నారు. దేశవ్యాప్తంగా 10 రా ష్ట్రాల నుంచి 140 పత్రాలు వచ్చాయన్నారు. కా ర్యక్రమంలో సదస్సు కోకన్వీనర్‌ టీ సంపత్‌కుమార్‌, ప్రొఫెసర్‌ రవీందర్‌ రెడ్డి, అధ్యాపకులు నాగరాజు పాత, స్వప్న, వివిధ విభాగాల అధ్యా పకులు, బోధనేతర సిబ్బంది, పత్ర సమర్పకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

పీజీ పరీక్షలు వాయిదా వేయాలి

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 31 నుంచి ఆగస్టు 13 వరకు జరిగే పీజీ రె గ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ ప రీక్షలను వాయిదా వే యాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్‌ చేశారు. తెయూ ఏబీవీపీ ఆధ్వర్యంలో బుధవారం పరిపాలనా భవనంలోని కంట్రోలర్‌ చాంబర్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బీ శివ మాట్లాడుతూ ఆగస్టు 4 నుంచి 11 వరకు సీపీగెట్‌ పరీక్షలు నిర్వహించే తేదీలలోనే పీజీ సెమిస్టర్‌ పరీక్షలు ఉండటంతో పీజీ ఎంట్రన్స్‌ రాసే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందన్నారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వర్సిటీ వీసీ, రిజిస్ట్రార్‌ల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ కే సంపత్‌కుమార్‌ హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు నిరసన విరమించారు. కార్యక్రమంలో ఏబీవీపీ స్టేట్‌ వర్కింగ్‌ కమిటీ మెంబర్‌ అమృతాచారి, వర్సిటీ అధ్యక్షుడు సాయికుమార్‌, నాయకులు సమీర్‌, అజయ్‌, అక్షయ్‌, రాకేశ్‌, అశోక్‌, నవీన్‌, పృథ్వీ, లెనిన్‌, రోహన్‌, శివ, విద్యార్థులు పాల్గొన్నారు.

డాక్టర్‌ పున్నయ్య రచనల ఆవిష్కరణ

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్‌ ఏ పున్నయ్య రచించిన సంభాషణ, సమాలోచన అనే పుస్తకాలను బుధవారం వీసీ ప్రొఫెసర్‌ టీ యాదగిరి రావు, సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌) డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రేవతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ వర్సిటీ ఆచార్యులు తరగతి గదికి మాత్రమే పరిమితం కాకుండా సామాజిక మార్పు కోసం, సంప్రదాయ విధానాలకు భిన్నంగా విభిన్న కోణాలు ఎంచుకొని రచనలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ దిశలో తెయూ అర్థశాస్త్ర విభాగాధిపతి పున్నయ్య ప్రాథమిక స్థాయి నుంచి స్నాతకోత్తర స్థాయి వరకు బలమైన తరగతి గది నిర్మాణానికి తపన పడుతున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ ఎం యాదగిరి, ప్రిన్సిపల్‌ మామిడాల ప్రవీణ్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ సంపత్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జీడీపీలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌ 1
1/2

జీడీపీలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌

జీడీపీలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌ 2
2/2

జీడీపీలో మూడో అతిపెద్ద దేశంగా భారత్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement