తెయూ విజయాలు ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

తెయూ విజయాలు ఆదర్శం

Jul 17 2025 3:17 AM | Updated on Jul 17 2025 3:17 AM

తెయూ

తెయూ విజయాలు ఆదర్శం

గురువారం శ్రీ 17 శ్రీ జూలై శ్రీ 2025

– 8లో u

తెయూ(డిచ్‌పల్లి): రాష్ట్రం పేరుతో ఏర్పడిన తెలంగాణ యూనివర్సిటీకి రాష్ట్రంలోనే ప్రత్యేక గుర్తింపు ఉందని వర్సిటీ చాన్స్‌లర్‌, రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అన్నారు. తెయూ రెండో స్నాతకోత్సవాన్ని(కాన్వొకేషన్‌) బుధవారం అట్టహాసంగా నిర్వహించా రు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. 2006లో ఆరు కోర్సులతో ప్రారంభమైన తెయూ.. నేడు ఏడు విభాగాలు, 24 ఉప విభాగాలుగా 31 కోర్సులతో కొనసాగుతోందన్నారు. డిచ్‌పల్లి మెయి న్‌ క్యాంపస్‌తోపాటు కామారెడ్డి జిల్లా భిక్కనూరు సౌత్‌ క్యాంపస్‌, సారంగపూర్‌ ఎడ్యుకేషన్‌ క్యాంపస్‌లలో విద్యా వికాసం చెందడం ఆనందంగా ఉందన్నారు. చైతన్యవంతమైన ఈ మట్టిలోని ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు యూనివర్సిటీ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయన్నారు. యూనివర్సిటీ సాధించిన విజయాలు, ప్రగతిపూర్వకమైన సంఘటనలు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. గత 19 ఏళ్లలో వర్సిటీ అధికారులు అధ్యా పకులు, విద్యార్థులు, పరిశోధకుల ఉమ్మడి కృషి, అంకితభావం అభివృద్ధిలో ప్రతిబింబిస్తోందన్నారు.

2023 – 24 రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం 51 శాతం పట్టభద్రులు దేశానికి నైపుణ్యాల కొరత తీరుస్తూ ఉద్యోగాలు పొందుతున్నారన్నారని గవర్నర్‌ వివరించారు. తెలంగాణ యూనివర్సిటీ ఆశాజనకమైన పారిశ్రామిక, విద్యాపరమైన సంబంధాలతో ముందుకు పోవడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ చెప్పినట్లు విద్య యొక్క అంతిమ లక్ష్యం సృజనాత్మకమైన మానవున్ని తయారు చేయడంతోపాటు ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ చారిత్రాత్మకమైన అభివృద్ధిని స్పృశించడమని పేర్కొన్నారు.

కాన్వొకేషన్‌కు హాజరైన గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మకు ముందుగా బెటాలియన్‌ పోలీసు లు గౌరవ వందనం సమర్పించారు. కాన్వొకేషన్‌కు రాజ్యసభ సభ్యుడు సురేశ్‌రెడ్డి, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, ఆర్మూర్‌ ఎ మ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో తెయూ రిజిస్ట్రార్‌ ఎం.యాదగిరి, డీన్స్‌ ఘంటా చంద్రశేఖర్‌, కే.అపర్ణ, జి.రాంబాబు, కే.లావణ్య, ఎం.శ్రీనివాస్‌, కే.సంపత్‌కుమార్‌, ప్రిన్సిపాల్‌ ప్రవీ ణ్‌ మామిడాల, ప్రొఫెసర్‌లు ఆరతి, కనకయ్య, వి ద్యావర్ధిని, అరుణ, ఆంజనేయులు, నాగరాజు, పీ ఆర్‌వో పున్నయ్య, ఏపీఆర్‌వో అబ్దుల్‌ ఖవి, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.

బంగారు పతకాలు.. డాక్టరేట్‌ పట్టాలు

2014 నుంచి 2023 వరకు 15 విభాగాల్లో 130 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చూపగా, దరఖాస్తు చేసుకున్న 113 మందికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ముఖ్యఅతిథి ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌ చేతుల మీ దుగా స్నాతకోత్సవంలో బంగారు పతకాలు అందజేశారు. అలాగే 2017 నుంచి 2025 జూన్‌ వరకు ఏడు విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మంది పరిశోధకులకు పీహెచ్‌డీ (డాక్టరేట్‌) పట్టాలను అందజేశారు.

క్షుణ్ణంగా తనిఖీలు

తెయూ క్రీడామైదానం లో ఏర్పాటు చేసిన కాన్వొకేషన్‌ ప్రాంగణంలో పోలీస్‌ కమిషనర్‌ సాయిచైతన్య ఆధ్వర్యంలో స్నిఫర్‌ డాగ్‌ బృందం, బాంబు డిస్పోజబుల్‌ టీం, ఇంటిలిజెన్స్‌ అధికారులు బందోబస్తు నిర్వహించారు. ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి నిర్వహించిన లోనికి అనుమతించారు.

ఇంజినీరింగ్‌, ఫార్మసీ

కళాశాలల ఏర్పాటుకు కృషి

తెయూ వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ టీ.యాదగిరిరావు మాట్లాడుతూ.. వర్సిటీలో ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. నూతనంగా పరిపాలనా భవనం, 500 మంది విద్యార్థినులకు సరిపడా అన్ని రకాల వసతులు ఉండే బాలికల వసతి గృహం, వేయి మంది సామర్ధ్యం కలిగిన ఆడిటోరియం, క్రీడామైదానం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. తెయూ పరిధిని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుంచి నిర్మల్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు విస్తరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి, జిల్లా ప్రజాప్రతినిధులతోపాటు బోధన, బోధనేతర సిబ్బంది సమష్టి కృషిపైనే ఆధారపడుతుందని అన్నారు.

న్యూస్‌రీల్‌

రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు పొందిన

తెలంగాణ యూనివర్సిటీ

ఇక్కడి ప్రజల ఆకాంక్షలు, సామర్థ్యాలు వర్సిటీ అభివృద్ధిలో స్ఫూర్తినిస్తున్నాయి

రెండో స్నాతకోత్సవంలో వర్సిటీ

చాన్స్‌లర్‌, రాష్ట్ర గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

ముఖ్యఅతిథిగా హాజరైన ఐఐసీటీ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ చంద్రశేఖర్‌

113 మందికి గోల్డ్‌ మెడల్స్‌..

157 మందికి డాక్టరేట్‌లు అందజేత

తెయూ విజయాలు ఆదర్శం1
1/5

తెయూ విజయాలు ఆదర్శం

తెయూ విజయాలు ఆదర్శం2
2/5

తెయూ విజయాలు ఆదర్శం

తెయూ విజయాలు ఆదర్శం3
3/5

తెయూ విజయాలు ఆదర్శం

తెయూ విజయాలు ఆదర్శం4
4/5

తెయూ విజయాలు ఆదర్శం

తెయూ విజయాలు ఆదర్శం5
5/5

తెయూ విజయాలు ఆదర్శం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement