
టీబీ ముక్త్ భారత్‌లో భాగస్వాములు కావాలి
నిజామాబాద్‌అర్బన్: క్షయ రహితంగా దేశాన్ని తీ ర్చిదిద్దాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్ర తిష్టాత్మకంగా అమలు చేస్తున్న టీబీ ముక్త్ భారత్ అ భియాన్‌లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావా లని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపునిచ్చారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో బుధవారం టీబీ ముక్త్ భారత్ అభియాన్‌పై కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి, అధికారులతో కలిసి గవర్నర్ సమీక్షించారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, సమష్టి కృషితోనే సమగ్ర ప్రగతి కల సాకారమవుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక ప్రతిభ కలిగి ఉంటారని, దానిని సమాజ ప్రగతికి వినియోగించాలని కోరారు. సామాజిక, సాహితీ, సేవా, క్రీడా తదితర అన్ని రంగాల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారు, తమతమ రంగాల ద్వారా ఆయా మాధ్యమాలను ఉపయోగిస్తూ క్షయ నిర్మూలనకు కృషి చేయాలని సూచించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన జిల్లాకు చెందిన మాలావత్ పూర్ణ, గుగులోత్ సౌమ్యను ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్’కు తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరించాలని గవర్నర్ కోరారు. కవులు, రచయితలు తమ రచనల ద్వారా, కళాకా రులు ప్రదర్శనల ద్వారా ప్రజలను టీబీ నిర్మూలన దిశగా చైతన్యపర్చాలని పిలుపునిచ్చారు. జిల్లా యంత్రాంగం, రెడ్ క్రాస్ సొసైటీ సమన్వయం ఏర్పర్చుకుని, పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. టీబీ నిర్ధారణ అయిన పేషెంట్లకు దాతల ద్వారా పోషక ఆహార కిట్లను అందించాలన్నారు.
జిల్లా భౌగోళిక స్వరూపం, స్థితిగతులు, ప్రాముఖ్యతను కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గవర్నర్ దృష్టికి తెచ్చారు. క్షయ నిర్మూలన చర్యల్లో భాగంగా హై రిస్క్ గ్రూప్‌లో ఉన్న వారందరికీ స్క్రీనింగ్, ఎక్స్ రే చేయిస్తున్నామని, వ్యాధి లక్షణాలు ఉన్నవారికి తెమడ పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. క్షయ నిర్మూలన కోసం చేసిన విశేష కృషికి గాను 2022–23 సంవత్సరానికిగాను జిల్లాకు గోల్డ్ మెడల్ దక్కిందని అన్నారు. తలసేమియా బాధితులకు అవసరమైన బ్లడ్ యూనిట్లను రెడ్ క్రాస్ ద్వారా సమకూరుస్తున్నామని, వృద్ధుల కోసం రెడ్ క్రాస్, జిల్లా యంత్రాంగంల సంయుక్త ఆధ్వర్యంలో వద్ధాశ్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేశ్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ సాయిచైతన్య, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్‌కుమార్, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్ మావీ, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
సమష్టి కృషితోనే క్షయ నిర్మూలన
టీబీపై ప్రజల్లో అవగాహన కల్పించాలి
దాతల సహకారంతో పేషెంట్లకు పోషకాహార కిట్లను అందజేయాలి
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపు

టీబీ ముక్త్ భారత్‌లో భాగస్వాములు కావాలి