
60 గ్రాముల గంజాయి పట్టివేత!
ఖలీల్‌వాడి: నగరంలోని ఎల్లమ్మగుట్ట బ్రిడ్జి వద్ద గంజాయి అమ్ముతున్న బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి నుంచి ఎండు గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. చిన్న, చిన్న ప్యాకెట్లలో సుమారు 60 గ్రాముల వరకు గంజాయి ఉంటుందని సమాచారం. ఈ విషయమై నాలుగో టౌన్ ఎస్సై శ్రీకాంత్‌ను వివరణ కోరగా గంజాయి పట్టుకున్నామని, బాలుడు మైనరా? మేజరా? ఆనేది నిర్ధారించాల్సి ఉందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నగరంలోని ఓ ప్రయివేట్ కాలేజీకి చెందిన విద్యార్థులు గంజాయి పడుతుండగా పోలీసులు పట్టుకున్నారు. వారికి కౌన్సెలింగ్ ఇచ్చిన తర్వాత కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఏడు ఇసుక ట్రాక్టర్లు..
రుద్రూర్: పోతంగల్ మండలం కొడిచర్ల శివారులోని మంజీరా నది నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న ఏడు ట్రాక్లర్లను, ఒక ట్రాలీని సోమవారం తెల్లవారుజామున పట్టుకున్నట్టు ఎస్సై సునీల్ తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి ట్రాక్టర్లను పట్టుకుని కోటగిరి పోలీస్‌స్టేషన్ తరలించామని ఆయన పేర్కొన్నారు. ట్రాక్టర్ డ్రైవర్లు, యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.