
నిజామాబాద్
పసుపు రైతులకు..
బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పసుపు రైతులకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి అన్నారు.
గురువారం శ్రీ 3 శ్రీ జూలై శ్రీ 2025
– 8లో u
కసాబ్‌గల్లీలో నీటి కుళాయి గుంతలోకి చేరిన మురుగు నీరు
మారుతినగర్ రోడ్ నెం.5 లో నివాసాల మధ్య నిలిచిన మురుగునీరు
నిజామాబాద్‌నాగారం : మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్‌గా అప్‌గ్రేడ్ అయిన నిజామాబాద్ నగరంలో ఆ స్థాయి సౌకర్యాలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. శానిటేషన్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి నగరానికి రోగాల ముప్పు పొంచి ఉంది. రోడ్లపక్కన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేక పలు ప్రాంతాల్లో మంచినీటి కుళాయి గుంతల్లోకి మురుగు నీరు చేరుతోంది. దశాబ్దన్నర క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యూజీడీ (అండ్ గ్రౌండ్ డ్రెయినేజీ) పనులు ఇప్పటికీ ఓ కొలక్కి రాకపోవడం నగరంలోని పరిస్థితులకు అద్దం పడుతోంది. నిజామాబాద్ నగరంలో 60 డివిజన్‌లు.. ఒక్కో డివిజన్ పరిధిలో 8 నుంచి 10వరకు కాలనీలు ఉన్నాయి. సుమారు లక్షా 10వేల కుటుంబాలు ఉండగా.. 4.30లక్షల జనాభా ఉంది.
చంద్రశేఖర్‌కాలనీ, మారుతినగర్, కంఠేశ్వర్, దుబ్బ, గౌతంనగర్, కెనాల్‌కట్ట, నాగారం, సాయినగర్, గాయత్రినగర్, ఆనంద్‌నగర్, పద్మనగర్, వినాయక్‌నగర్, సీతారాంనగర్‌కాలనీ, వర్నిరోడ్, మాలపల్లి, కోజాకాలనీ, హైమద్‌పురాకాలనీ తదితర ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. అపరిశుభ్ర వాతావరణం కారణంగా కాలనీలు కంపుకొడుతున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారుతోంది.
ఆరు జోన్‌లు..
కార్పొరేషన్ పరిధిలో జోన్ – 1 (నాందేవ్‌వాడ), జోన్ – 2(గోల్ హనుమాన్), జోన్ – 3(పెద్దబజార్), జోన్ – 4ఏ(రాజీవ్‌గాంధీ ఆడిటోరియం), జోన్ – 4బీ(కంఠేశ్వర్), జోన్ – 5(అర్సపల్లి) మొత్తం ఆరు జోన్‌లు ఉన్నాయి. ఒక్కో జోన్ పరిధిలో సుమారు 180 మందికిపైగా కార్మికులు, జవాన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్ విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే ఒక ప్రాంతంలో డ్రెయినేజీలను శుభ్రం పరిచిన తరువాత మళ్లీ అటువైపు మూడునాలుగు నెలలపాటు రావడం లేదని స్థానికులు అంటున్నారు.
యూజీడీ.. ట్రాజెడీ
15 ఏళ్ల క్రితం నగరంలో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ (యూజీడీ) పనుల వ్యవహారం ట్రాజెడీగా మిగిలింది. 2008లో రూ. 94 కోట్లతో ప్రారంభమైన పనులు మధ్యలో ఆగిపోయాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రతిపదనలను రూ. 231 కోట్లకు పెంచినప్పటికీ పనులు పూర్తికాకపోవడంతో మళ్లీ రూ.85 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. పనుల్లో భాగంగా రోడ్లను ఎక్కడపడితే అక్కడ తవ్వారు. యూజీడీ పేరుతో అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు కమిషన్‌లను జేబుల్లో వేసుకుంటున్నారని నగరవాసులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో నామమాత్ర సేవలు..
వినాయక్‌నగర్, చంద్రశేఖర్ కాలనీ, దుబ్బ, సీతారాంనగర్‌కాలనీ, అర్సపల్లి, మాలపల్లి, గౌతంనగర్ లో మొత్తం ఏడు అర్బన్ హెల్త్ సెంటర్లు ఉండగా, నాగారం, ఖానాపూర్‌లో బస్తీ దవాఖానాలు ఉన్నాయి. అయితే ఎక్కడా కూడా సమయ పాలన పాటించడం లేదని రోగులు చెబుతున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు అందుబాటులో ఉండాల్సిన వైద్యులు రావడం లేదంటున్నారు. కిందిస్థాయి సిబ్బంది సమయ పాలన పాటిస్తున్నా.. వైద్యులు మాత్రం ఇష్టారాజ్యంగా వస్తూవెళ్తున్నారంటున్నారు. దీంతో రోగులకు ఫార్మసిస్ట్‌లు మాత్రమే మందులు ఇచ్చి పంపిస్తున్నారు.
న్యూస్‌రీల్
కార్పొరేషన్ కహానీ – 2
ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం
నగరంలో శానిటేషన్ వ్యవస్థ సరిగాలేకపోవడంతో ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. సరైన డ్రైయినేజీలు లేకపోవడంతో మురుగునీరు రోజుల తరబడి నిల్వ ఉండి దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. వర్షాలు కురుస్తుండడంతో ఎక్కడపడితే అక్కడ నీరు నిలుస్తోంది. వర్షాకాలం ప్రారంభంలోనే నగరవాసులు దగ్గు, చలి, నొప్పులు, వైరల్ ఫీవర్ తదితర వాటితో బాధపడుతూ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పిల్లలు అనారోగ్యం బారినపడితే భయంతో ప్రైవేట్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు.
అస్తవ్యస్తంగా శానిటేషన్
రోడ్ల పక్కన చెత్త కుప్పలు,
ప్లాస్టిక్ వ్యర్థాలు
అధ్వానంగా డ్రెయినేజీలు
మంచి నీటి కుళాయి
గుంతల్లోకి మురుగునీరు
బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్
సెంటర్లలో అంతంతమాత్రంగానే
వైద్య సేవలు
అస్తవ్యస్తంగా శానిటేషన్
రోడ్ల పక్కన చెత్త కుప్పలు,
ప్లాస్టిక్ వ్యర్థాలు
అధ్వానంగా డ్రెయినేజీలు
మంచి నీటి కుళాయి గుంతల్లోకి
మురుగునీరు
బస్తీ దవాఖానాలు, అర్బన్ హెల్త్
సెంటర్లలో అంతంతమాత్రంగానే
వైద్య సేవలు

నిజామాబాద్

నిజామాబాద్

నిజామాబాద్