పోచంపాడ్‌లో పిచ్చికుక్కల స్వైర విహారం | - | Sakshi
Sakshi News home page

పోచంపాడ్‌లో పిచ్చికుక్కల స్వైర విహారం

Jul 1 2025 7:16 AM | Updated on Jul 1 2025 7:16 AM

పోచంప

పోచంపాడ్‌లో పిచ్చికుక్కల స్వైర విహారం

బాల్కొండ: మెండోరా మండలం పోచంపాడ్‌లో సోమవారం ఉదయం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. గ్రామంలో వీధుల గుండా కనిపించిన వారిపై దాడి చేశాయి. దీంతో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన రజిత చేతిపై, విఠల్‌, విష్ణులకు కంటి, కాలి భాగాలపై దాడి చేసి గాయపర్చాయి. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించారు. పోచంపాడ్‌లో వీధి కుక్కులు ఎక్కువ కావడంతో కనిపిస్తే కరుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

డీఎస్‌ విగ్రహావిష్కరణలో దొంగల చేతివాటం

నిజామాబాద్‌ రూరల్‌: కంఠేశ్వర్‌ బైపాస్‌ సిగ్నల్‌ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డీఎస్‌ విగ్రహావిష్కరణలో కేంద్ర మంత్రి అమిత్‌షా చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. ఈ ఆవిష్కరణలో మారుతినగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి కాసుల రఘు, అలాగే బాశెట్టి గంగాధర్‌కు చెందిన బంగారు గొలుసులను గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించినట్లు రూరల్‌ ఎస్‌హెచ్‌వో ఆరిఫ్‌ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

అంతర్‌జిల్లా దొంగల ముఠా రిమాండ్‌

12 తులాల బంగారం, బైక్‌ స్వాధీనం

వేములవాడ: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్‌జిల్లా దొంగల ముఠాను రిమాండ్‌కు తరలించినట్లు వేములవాడ పోలీసులు సోమవారం తెలిపారు. వేములవాడ టౌన్‌ పీఎస్‌లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మహేశ్‌ బీ గీతే వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లాకు చెందిన బోదాసు మహేశ్‌ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన గద్దల స్వప్న, విశాల్‌సింగ్‌, జగిత్యాల జిల్లాకు చెందిన నేరెళ్ల శ్రీనివాస్‌, నేరెళ్ల రాణి, గోత్రాల బాలమణి ముఠాగా ఏర్పడి ఆర్మూర్‌, నిజామాబాద్‌, వేములవాడ, కోనరావుపేట, బోయినపల్లి ప్రాంతాల్లో గత రెండు నెలలుగా దొంగతనాలకు పాల్పడ్డారు. టెక్నాలజీ సాయంతో వీరు వేములవాడ సమీపంలో తిప్పాపూర్‌ బస్టాండ్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 12 తులాల బంగారం, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. దొంగలను పట్టుకున్న వేములవాడ టౌన్‌ సీఐ వీరప్రసాద్‌, ఎస్సైలు అనిల్‌కుమార్‌, వెంకట్రాజం, సిబ్బంది గోపాల్‌, పంతులు, లత, సాహెబ్‌ హుస్సేన్‌, దేవేందర్‌, సమియుద్దీన్‌ను అభినందించారు.

నలుగురు కానిస్టేబుళ్లకు పదోన్నతి

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని నలుగురు కానిస్టేబుళ్లకు హెడ్‌ కానిస్టేబుళ్లలుగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన కానిస్టేబుళ్లు ఎండీ తయ్యబ్‌ అలీ(మోర్తాడ్‌), ఈ ఈశ్వర్‌(ఇందల్వాయి), పి రాకేశ్‌(నిజామాబాదు రూరల్‌), ఎన్‌ వెంకట్‌ రామ్‌(సీసీఎస్‌, నిజామాబాద్‌) సీపీ సాయిచైతన్యను సోమవారం సీపీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం సీపీ సిబ్బందిని అభినందించారు.

పోచంపాడ్‌లో పిచ్చికుక్కల స్వైర విహారం
1
1/1

పోచంపాడ్‌లో పిచ్చికుక్కల స్వైర విహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement