
చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి
బోధన్‌రూరల్: మండలంలోని బండార్‌పల్లికి చెందిన సాయికుమార్(28) చేపల వేటకు వెళ్లి ప్రవమాదవశాత్తు వల చుట్టుకుని నీటి మునిగి మృతిచెందినట్లు బోధన్ రూరల్ ఎస్సై మచ్చేందర్ రెడ్డి సోమవారం తెలిపారు. మృతుడి భార్య అనురాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
అర్గుల్‌లో ఒకరి అదృశ్యం
జక్రాన్‌పల్లి: మండలంలోని అర్గుల్‌లో నివాసముంటున్న లింగంపేట గ్రామానికి చెందిన కొరబోయిన అశోక్ అనే వ్యక్తి అదృశ్యమైనట్లు ఎస్సై మాలిక్ రహమాన్ తెలిపారు. ఈ నెల 28న రాత్రి 9 గంటలకు జక్రాన్‌పల్లిలోని తన స్నేహితుడిని కలిసి వస్తానని చెప్పి బైక్‌పై వెళ్లిన అతను తిరిగి ఇంటికి రాలేదు. దీంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించలేదు. అశోక్ తండ్రి ప్రభురాజ్యం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

చేపల వేటకు వెళ్లి ఒకరి మృతి