
రెండే గదుల్లో నాలుగు తరగ తులా..?
నిజామాబాద్ లీగల్: ఒకటి నుంచి నాలుగో తరగతి వరకు రెండే తరగతి గదుల్లోనే పాఠశాల నిర్వహిస్తున్నారా అని సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు ఉపాధ్యాయులను ప్రశ్నించారు. సోమవారం నగరంలోని ధర్మపురిహిల్స్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను జడ్జి తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణలో ఖాళీ బీరు బాటిల్స్, పాన్ పరాగ్ లాంటి వస్తువులు ఉండటం గమనించారు. రాత్రి వేళల్లో అసాంఘిక శక్తులకు పాఠశాల అడ్డాగా మారకుండా చూడాలని ఉపాధ్యాయులకు సూచించారు. రాత్రి వేళ పోలీసులు పెట్రోలింగ్ చేసేలా ఆదేశాలు జారీ చేస్తామని, హెచ్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేయాలని జడ్జి సూచించారు.