
మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి
డిచ్‌పల్లి: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ కోసం ప్రతి ఒక్కరూ తమ ఇంటి వద్ద 6 మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని డిచ్‌పల్లి ఎంపీడీవో బుక్య లింగం నాయక్ సూచించారు. సోమవారం మండలంలోని ఘన్‌పూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పలువురు మహిళలకు మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ నర్సరీలో 10వేల మొక్కలు ఉండగా అందులో గ్రామంలోని ఇంటికి 6 మొక్కల చొప్పున 6,626 మొక్కలు పంపిణి చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన గ్రామాల్లో ఇలాగే ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని ఆయన సూచించా రు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమే ష్,సిబ్బంది,మహిళలు తదితరులు పాల్గొన్నారు.