
అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి
నిజామాబాద్ రూరల్: అన్ని వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని రూరల్ ఎమ్మెల్యే కాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను జక్రాన్‌పల్లి మండల రజక సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, పుష్పగుచ్ఛంతో సన్మానించారు. మండలంలోని అర్గుల్ గ్రామంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు రావాలని వారు ఎమ్మెల్యేను ఆహ్వానించారు. కార్యక్రమంలో రజకసంఘం మండల అధ్యక్షుడు చిన్నరెడ్డి, ఉపాధ్యక్షుడు సుధాకర్, సభ్యులు ప్రభాకర్, గంగాధర్, నారాయణ, జైపాల్. మైపాల్, రాజు, శివకుమార్, శ్రీనివాస్, స్వామి, నాగరాజ్, తదితరులు పాల్గొన్నారు.