సంక్షిప్తం | - | Sakshi
Sakshi News home page

సంక్షిప్తం

Jul 1 2025 4:32 AM | Updated on Jul 1 2025 4:32 AM

సంక్షిప్తం

సంక్షిప్తం

బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం బకాయిలను విడుదల చేయాలి

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లావ్యాప్తంగా బెస్ట్‌ అవైలబుల్‌ స్కీం బకాయిలను విడుదల చేయాలని యుఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పెద్ద సూరి ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డి మాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ పేద విద్యార్థులకు చేయూతనందించడానికి తెచ్చిన ఈ పథకానికి నిధులు రాకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రభు త్వం స్పందించి వెంటనే నిధులను విడుదల చేయాలన్నారు.

సారంగపూర్‌ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలి

నిజామాబాద్‌ సిటీ: రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సారంగాపూర్‌లోని సహకార చక్కెర ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలని చెరుకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్‌ ఆకుల పాపయ్య డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకు ఇటీవల ఎన్‌సీఎస్‌ఎఫ్‌ సారంగాపూర్‌ చక్కెర ఫ్యాక్టరీని తెరిపించాలని రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డి వినతిపత్రం ఇవ్వడం అభినందనీయమన్నారు. కేంద్ర ప్రభుత్వం చెరుకుకు టన్నుకు రూ.4వేల ధర ప్రకటించి రైతులను ప్రోత్సహించాలన్నారు. ఏఐకేఎంఎస్‌ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్‌ భూమయ్య, నాయకులు కొట్టె గంగాధర్‌, మురళి తదితరులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న వారాహిమాత నవరాత్రి ఉత్సవాలు

నిజామాబాద్‌ రూర ల్‌:నగరంలోని అ మ్మ వెంచర్‌లో గల వారాహిమాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నా యి. సోమవారం భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు ని ర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ మంచాల జ్ఞానేంద్ర గుప్తా భక్తులు పాల్గొన్నారు.

6న ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు

నిజామాబాద్‌నాగారం: నగరంలోని శివాజీనగర్‌లోగల వైశ్య ఉన్నత పాఠశాల మాణిక్‌భవన్‌లో ఈనెల 6న ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష, కార్యవర్గ ఎన్నికలు నిర్వహించనున్నట్లు అధ్యక్ష అభ్యర్థి అర్వపల్లి పురుషోత్తం గుప్తా అన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టణంలోని ఆర్యవైశ్యులంతా తనకు మద్దతు తెలిపి, ఓటు వేయాలని, అలాగే తమ ప్యానెల్‌ సభ్యులను కూడా గెలిపించాలని కోరారు.

తహిసీల్దార్‌ను కలిసిన డీఎస్‌పీ నాయకులు

ధర్పల్లి: ధర్పల్లి తహసీల్దార్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన శాంతను ధర్మ సమాజ్‌ పార్టీ (డీఎస్‌పీ) నాయకులు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో డీఎస్‌పీ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ప్రశాంత్‌, మండల అధ్యక్షులు మహిపాల్‌, నాయకులు కిషన్‌ గంగాధర్‌ , శ్రీకాంత్‌ ,చంటి తదితరులు పాల్గొన్నారు.

డాక్టర్‌ కాసర్ల కృషి అపూర్వం

నిజామాబాద్‌ రూరల్‌:జాతీయస్థాయి ఉత్తమ ఉపాధ్యాయు లుగా వరల్డ్‌ చారిటీ వెల్ఫేర్‌ సంస్థ వారిచే గౌరవింపబడిన డాక్టర్‌ కాసర్ల అపూర్వమని ప్రముఖ సామాజిక ఆధ్యాత్మిక వేత్త రాజ్‌కుమార్‌ సుబేదార్‌ అన్నారు. సోమవారం తెలుగు వెలుగు సాంస్కతిక సంస్థ ఆధ్వర్యంలో అధ్యక్షులు చంద్రశేఖర్‌ అధ్యక్షతన సంస్థ కార్యాలయంలో డాక్టర్‌ కాసర్ల అభినందన సభ నిర్వహించారు. ఈసభలో సుప్రసిద్ధ కవులు డాక్టర్‌ గణపతి, అశోక శర్మ, మహేశ్‌ బాబు,వి.పి. చందన్‌ రావు, సూర్య ప్రకాశరావు, డాక్టర్‌ గంట్యాల ప్రసాద్‌, కందకుర్తి ఆనంద్‌, చింతల శ్రీనివాస్‌ గుప్త తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement