పీసీసీ చీఫ్‌ను కలిసిన శ్యాం బాబు | - | Sakshi
Sakshi News home page

పీసీసీ చీఫ్‌ను కలిసిన శ్యాం బాబు

Jul 1 2025 4:32 AM | Updated on Jul 1 2025 4:32 AM

పీసీస

పీసీసీ చీఫ్‌ను కలిసిన శ్యాం బాబు

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌గౌడ్‌ను మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌ శ్యాంబాబు హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం గాంధీభవన్‌లో స్టేట్‌ లీగల్‌ సెల్‌ వైస్‌ చైర్మన్‌ దయాకర్‌గౌడ్‌, టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సభ్యుడు జి.వి రామకృష్ణతో కలిసి వెళ్లారు.. తనను మున్సిపల్‌ స్టాండింగ్‌ కౌన్సిల్‌గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

లయన్స్‌క్లబ్‌ చైర్మన్‌గా అవన్‌కుమార్‌

నిజామాబాద్‌నాగారం: జిల్లాలోని నాలుగు లయన్స్‌ క్లబ్‌లకు జోన్‌ చైర్మన్‌గా నగరానికి చెందిన లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ నిజామాబాద్‌ పూర్వ అధ్యక్షుడు కాలేరు అవన్‌ కుమార్‌కు లయన్స్‌ ఇంటర్నేషనల్‌ జిల్లా గవర్నర్‌ అమర్నాథ్‌రావు సోమవారం నియామకపత్రం అందజేశారు. ఈ మేరకు జిల్లాలోని లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ తెలంగాణ, నిజామాబాద్‌, డైమండ్‌, సెంట్రల్‌ క్లబ్‌లకు అవన్‌ కుమార్‌ జోన్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. లయన్స్‌ సేవలను మరింత విస్తృత పరుస్తానని అవన్‌కుమార్‌ పేర్కొన్నారు.

జాతీయ స్థాయి హాకీ

పోటీలకు ఎంపిక

సిరికొండ: జాతీయ స్థాయి హాకీ పోటీలకు తూంపల్లి గ్రామానికి చెందిన క్రీడాకారిణి బైకన్‌ జశ్విత ఎంపికై నట్లు జెడ్పీహెచ్‌ఎస్‌ పీడీ సడాక్‌ నగే్‌శ్‌ సోమవారం తెలిపారు. తెలంగాణ హాకీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపులో ప్రతిభ కనబర్చి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. జార్ఖండ్‌ రాష్ట్రంలో జూలై 03 నుంచి 08 వరకు జరగనున్న జాతీయ స్థాయి సబ్‌ జూనియర్‌ పోటీల్లో జశ్విత పాల్గొననున్నట్లు పీడీ తెలిపారు. జశ్విత జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడంపై ఎంఈవో రాములు, ఇన్‌చార్జి హెచ్‌ఎం మనోహర్‌, జిల్లా హకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు విశాఖ గంగారెడ్డి, కార్యదర్శి రమణలు హర్షం వ్యక్తం చేశారు.

ఫీజు నియంత్రణ

చట్టం అమలు చేయాలి

నిజామాబాద్‌అర్బన్‌ : ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని, అధిక ఫీజు వసూలు చేస్తున్న నారాయణ పాఠశాలపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్‌) నాయకులు డిమాండ్‌ చేశారు. సోమవారం పాఠశాల ఎదుట వారు ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా అ ధ్యక్ష ,కార్యదర్శులు రఘురాం, అంజలి మా ట్లాడారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్య దర్శి కుషాల్‌, నాయకులు నవీన్‌ కృష్ణ, లక్ష్మణ్‌, రమేష్‌, దినేష్‌, తదితరులు పాల్గొన్నారు.

ధాన్యం తూకంలో అక్రమాలపై అదనపు కలెక్టర్‌కు ఫిర్యాదు

నిజామాబాద్‌అర్బన్‌: వరి ధాన్యం తూకంలో రైస్‌మిల్‌ యాజమానులు అక్రమాలకు పాల్పడినట్లు భారతీయ కిసాన్‌సంఘ్‌ జిల్లా కమిటీ ఆరోపించింది. ఈ మేరకు సోమవారం అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఫిర్యాదు చేశారు. మోపాల్‌ మండలం సిర్‌పూర్‌ గ్రామం రైతులు యాసంగి ధాన్యం కొనుగోలు సమయంలో అకాల వర్షాలు కురిస్తాయి. అప్పటికే ధాన్యం విక్రయించిన రైతులు ధాన్యంను లారీల్లో రైస్‌మిల్లులకు తరలించారు. 745 వరిధాన్యం బస్తాలు అమ్మితే 560 బస్తాల ధాన్యం మాత్రమే అమ్మినట్లు ట్యాక్‌షీట్‌లో చూపించారని రైతులు వాపోయారు. విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని వారు పేర్కొన్నారు. భారతీయ కిసాన్‌ సంఘ జిల్లా అధ్యక్షుడు సాయిరెడ్డి, కోశాధికారి భూమారెడ్డి, నగర అధ్యక్షలు దశరత్‌రెడ్డి, కార్యవర్గ సభ్యుడు గంగారెడ్డి, సిర్‌పూర్‌ గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.

పీసీసీ చీఫ్‌ను కలిసిన   శ్యాం బాబు 1
1/4

పీసీసీ చీఫ్‌ను కలిసిన శ్యాం బాబు

పీసీసీ చీఫ్‌ను కలిసిన   శ్యాం బాబు 2
2/4

పీసీసీ చీఫ్‌ను కలిసిన శ్యాం బాబు

పీసీసీ చీఫ్‌ను కలిసిన   శ్యాం బాబు 3
3/4

పీసీసీ చీఫ్‌ను కలిసిన శ్యాం బాబు

పీసీసీ చీఫ్‌ను కలిసిన   శ్యాం బాబు 4
4/4

పీసీసీ చీఫ్‌ను కలిసిన శ్యాం బాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement