
పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం
నిజామాబాద్‌అర్బన్ : పేదలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ అన్నారు. సోమవారం ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో 27మంది బాధితులకు రూ.16 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ..అర్హులకు ఇందిరమ్మ ఇల్లు, కొత్త రేషన్ కార్డులు అందిస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్‌ఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను షబ్బీర్ ఆలీ అందించారు. అర్బన్ నియోజకవర్గంలో 1300 మంది లబ్ధిదారులను ఎంపిక కాగా, త్వరలోనే ఇంకా 2200 మంది లబ్ధిదారులను ఎంపిక చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు షబ్బీర్ ఆలీకి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా కార్యదర్శి రాచకొండ విగ్నేష్, బొర్రా నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం గత రెండేళ్లుగా రూ. 300 కోట్లు చెల్లించడంలేదన్నారు. దీంతో దళిత గిరిజన విద్యార్థుల చదువుకు కోత పడే అవకాశం ఉందన్నారు. నగరంలోని ఇంపీరియల్ గార్డెన్‌లో షాహిన్ కాలేజ్ విద్యార్థుల సన్మాన కార్యక్రమంలో షబ్బీర్ ఆలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షబ్బీర్ ఆలీ మాట్లాడుతూ ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. షాహిన్ కాలేజీలో 22 మంది విద్యార్థులకు 4 శాతం రిజర్వేషన్ ద్వారా ఎంబీబీఎస్ సీట్లు సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు చేసిన ఘనత ఉందన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, షాహిన్ కాలేజీ యాజమాన్యం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ
ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ