
వరినాట్లలో పశ్చిమబెంగాల్ కూలీలు
ధర్పల్లి: మండలంలో వరి సాగు పనులు జోరుగా కొనసాగుతున్నాయి. రామడుగు, మైలారం, దుబ్బాక, ధర్పల్లి, హోన్నాజీపేట్ గ్రామాల్లో ఇప్పటికే వరినాట్లు ప్రారంభమయ్యాయి. స్థానికంగా కూలీల కొరత అధికంగా ఉండడంతో ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు (మగ) వరి నాట్లు వేసేందుకు ఇక్కడికి వలస వస్తున్నారు.హోన్నాజీపేట్ గ్రామ శివారులో పశ్చిమ బెంగాల్ చెందిన కూలీలు వరి నాట్లు వేస్తున్నారు. ఎకరాకు రూ. 4000 నుంచి రూ.4500 వరకు వరి నాట్లు వేయడానికి రైతులు వీరికి చెల్లిస్తున్నారు. రోజువారీగా ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు నాట్లు వేస్తున్నారు.
రేపటి నుంచి డిగ్రీ, పీజీ,
ఇంజినీరింగ్ కళాశాలల బంద్
నిజామాబాద్‌అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 2, 3, 4 తేదీల్లో 72 గంటల పాటు డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ప్రొఫెషనల్ కళాశాలల బంద్ చేపట్టినట్లు పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు సహకరించి బంద్‌ను విజయవంతం చేయాలన్నారు.ఈమేరకు సోమవారం నగరంలోని నీలం రామచంద్య్ర భవన్‌లో బంద్‌కు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. నాయకులు నిఖిల్, దేవిక, సాయి కిరణ్, దుర్గా ప్రసాద్, రాజు పాల్గొన్నారు.
బీఎస్పీ రూరల్ నియోజకవర్గ
ఇన్‌చార్జిగా నీరడి లక్ష్మణ్
నిజామాబాద్‌నాగారం: బహుజన్ సమాజ్ పార్టీ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా నీరడి లక్ష్మణ్ నియమితులయ్యారు. ఈ నెల 28న ఆయన బీఎస్పీలో చేరారు. రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఎస్ పాండు నీరడి లక్ష్మణ్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. నియోజకవర్గంలో బీఎస్పీ అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు.

వరినాట్లలో పశ్చిమబెంగాల్ కూలీలు