
అమిత్ షా దిష్టిబొమ్మ దహనం
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో వామపక్ష పార్టీ, ప్రజాసంఘాల నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అమిత్ షా దిష్టిబొమ్మను ధర్నాచౌక్ వద్ద దహనం చేశారు. సోమవారం ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ముందస్తు పేరుతో అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లలో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి ఆందోళనలకు, నిరసనలకు పిలుపు ఇవ్వకున్నా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రముఖులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడల్లా ఇలా ముందస్తు పేరుతో అరెస్టులు చేయడం పోలీసులకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమిత్ షా జిల్లా పర్యటనతో ప్రజలకు, రైతులకు ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. పసుపు బో ర్డుకు అధికారులను, సిబ్బందిని, నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో నా యకులు కృష్ణ, ఎం నరేందర్, డి రాజేశ్వర్, కె గంగాధర్, ఎం సుధాకర్, డి కిషన్, కె గణేశ్, కిషన్, సజన్,గంగాధర్ చరణ్,సంతోష్,లక్ష్మి,వసంత్, సాయి లు,నరేశ్, ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.