
జీపీ నిర్మాణ పనులకు భూమిపూజ
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి మండలం అమృతాపూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు సోమవారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా గంగాధర్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న జీపీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి నూతన భవనం నిర్మాణం కోసం రూ.20లక్షలు నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. భవన నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శ్యాంసన్, ధర్మాగౌడ్, గంగాధర్‌గౌడ్, నర్సయ్య, బాలయ్య, కృష్ణ, పీఆర్ ఏఈ శ్రీధర్, పంచాయతీ కార్యదర్శి భూలక్ష్మి, గ్రామపెద్దలు తదితరులు పాల్గొన్నారు.