
నిర్భంద అరెస్టులు సరికాదు
నిజామాబాద్ సిటీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఇందూరు పర్యాటన సందర్భంగా సందర్భంగా వామపక్ష నేతల గృహనిర్భందం, అరెస్టులు సరికాదని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేశ్ బాబు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ అర్వింద్ పెండింగ్ రైల్వే లైన్ పనులకు నిధులను కేంద్రం నుంచి తీసుకురాలేదన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ఓపెన్ చేస్తానని చెప్పిన మాట ఇప్పటికీ నెరవేరలేదన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో లక్కంపల్లి సేజ్ కోసం 500 ఎకరాల భూమిని సేకరించిన ఒక్క పరిశ్రమను తీసుకురాలేదన్నారు. ఈ సమావేశంలో నాయకులు వెంకటేశ్, నాగన్న, నన్నేసాహెబ్, జంగం గంగాధర్, కొండ గంగాధర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.
బంగారం ధరలు (10గ్రాములు)