ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

Jun 29 2025 3:00 AM | Updated on Jun 29 2025 3:05 AM

ధర్పల్లి: ప్రతి ఒక్కరూ ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాస్‌ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఆదర్శ పాఠశాల విద్యార్థులు ట్రాఫిక్‌ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వాహనదారులకు పుష్పగుచ్ఛం అందించి హెల్మెట్‌ ప్రాముఖ్యతను వివరించారు. రాత్రి సమయంలో ప్రమాదాల నివారణకు వాహనాలకు రేడియం స్టిక్కర్లను అతికించారు. ఉపాధ్యాయులు లక్ష్మీనర్సయ్య, డేనియల్‌, రంజిత్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధ్యాయుల కృషి

అభినందనీయం

మోపాల్‌: ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి, విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న సిర్‌పూర్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులను హెచ్‌ఎం సత్యనారాయణ అభినందించారు. మోపాల్‌ మండలంలోని సిర్‌పూర్‌ ప్రాథమిక పాఠశాలలో వంద మంది విద్యార్థులకు కంపాస్‌ బాక్సులు, పెన్నులు, పెన్సిళ్లు, తదితర వస్తువులను శనివారం పంపిణీ చేశారు. కాగా పాఠశాలలో నో బ్యాగ్‌ డే సందర్భంగా విద్యార్థులు తయారు చేసిన ఇన్నోవేటివ్‌ వస్తువులను ప్రదర్శించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రాజేందర్‌, అక్బర్‌ భాషా, వసంత, అనురాధ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ

ఇందల్వాయి: మండలంలోని గండితండా జీపీ సెక్రటరి అశోక్‌ ప్రోత్సాహంతో హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ అనీల గ్రామ పాఠశాల విద్యార్థులకు రూ. పదివేలు విలువ చేసే నోట్స్‌ బుక్స్‌, పెన్సులను శనివారం అందించారు. ఎంఈవో శ్రీధర్‌, ఎంపీడీవో అనంత్‌రావు, హెచ్‌ఎం పరమేశ్వర్‌, ఉపాధ్యాయులు ఉన్నారు.

కేంద్ర మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకుంటాం

నిజామాబాద్‌అర్బన్‌: జిల్లా కేంద్రంలో కేంద్ర మంత్రి అమిత్‌ షా నిర్వహించే కార్యక్రమాన్ని అడ్డుకుంటామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేశ్‌ అన్నారు. శనివారం నగరంలోని ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో నిర్వహించిన సమావే శంలో మాట్లాడారు. పార్లమెంట్‌లో అంబేడ్కర్‌ ను అవమానించిన హోం మంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని లేదంటే జిల్లా పర్యటనను అడ్డుకుంటామన్నారు. నాయకులు రాజు, ఆజాద్‌, గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు ప్రారంభం

సిరికొండ: మండలంలోని కొండాపూర్‌లో పలు అభివృద్ధి పనులను కాంగ్రెస్‌ నాయకులు శనివారం ప్రారంభించారు. 350 మీటర్ల సీసీ డ్రెయినేజీ నిర్మాణానికి రూ. ఏడున్నర లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి రూ. మూడు లక్షల నిధులను ఎమ్మెల్యే భూపతిరెడ్డి మంజూరు చేశారని వారు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నల్ల బుచ్చన్న, ఆకుల జగన్‌, నీరటి శ్రీధర్‌, గౌసొద్దీన్‌, కిశోర్‌గౌడ్‌, చంద్రాగౌడ్‌, ఎల్లయ్య, శంకర్‌గౌడ్‌, రవిగౌడ్‌ పాల్గొన్నారు.

రక్తదాన శిబిరం

నిజామాబాద్‌నాగారం: నగరంలోని రెడ్‌క్రా స్‌లో జమాల్‌పూర్‌ విఠల్‌ వ్యాస్‌ మెమోరియల్‌ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబి రం నిర్వహించారు. జర్నలిస్టు విఠల్‌ వ్యాస్‌ ఐ దో వర్ధంతి సందర్భంగా 19 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో వైద్యులు బొద్దుల రాజేంద్రప్రసాద్‌, ధన్‌పాల్‌ వినయ్‌, సందీప్‌రావు, సొసైటీ అధ్యక్షుడు జమాల్‌పూర్‌ రాజశేఖర్‌, రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ ఆంజనేయులు, మెడికల్‌ ఆఫీసర్‌ వి రాజేశ్‌, విజయానంద్‌, బైర శేఖర్‌, చింతల గంగాదాస్‌, అర్వింద్‌, పంచరెడ్డి శ్రీకాంత్‌, సుభాష్‌, మధుసూదన్‌, ఆశ నారాయణ, దయాకర్‌ గౌడ్‌, సభ్యులు పాల్గొన్నారు.

చంద్రశేఖర్‌కు పీహెచ్‌డీ ప్రదానం

డిచ్‌పల్లి: తెలంగాణ యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్న మైస చంద్రశేఖర్‌ ఏపీ లోని ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి గణిత శాస్త్రంలో పీహెచ్‌డీ పట్టాను శనివారం అందుకున్నారు. ‘సమ్‌ జనరలైజేషన్స్‌ యూసింగ్‌ డిఫరెంట్‌ టైప్స్‌ ఆఫ్‌ కంపెటబిలిటి’ అనే అంశంపై గ్రంథాన్ని సమర్పించారు. పీహెచ్‌డీ పొందిన చంద్రశేఖర్‌ను యూనివర్సిటీ అధ్యాపకులు అభినందించారు.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి 1
1/3

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి 2
2/3

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి 3
3/3

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement