
లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలి
నిజామాబాద్‌అర్బన్: వన మహోత్సవం లక్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటాలని, సమగ్ర ప్రణాళికతో సమాయత్తమై సమష్టిగా కృషి చే యాలని కావాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కా ర్యాలయాల సముదాయం నుంచి శనివారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వన మహోత్సవం, ఇందిరమ్మ ఇళ్లు, సీజనల్ వ్యా ధుల నియంత్రణ, ఎల్‌ఆర్‌ఎస్ తదితర అంశాలపై మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, వైద్యాధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమయాత్తం సమీక్షించారు. గతేడాది నాటిన మొక్కల స్థితిగతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక అందించాలని అన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. మొక్కలు నాటిన ప్రతి చోట వివరాలతో కూడిన నేమ్ బోర్డు ఉండాలన్నారు. మొక్కల పంపిణీ కోసం నర్సరీలను సిద్ధం చేస్తూ, వాటిని నాటేందుకు నిర్దేశిత ప్రదేశాల్లో గుంతలు తవ్వించాలని అన్నారు. బ్లాక్ ప్లాంటేషన్‌లో విద్యార్థులను భాగస్వాములు చేయాలని, ప్రజాప్రతినిధులను ఆ హ్వానించి కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించాలని ఆదేశించారు. ‘ఫ్రైడే – డ్రై డే’ ప్రతి చోటా అమలయ్యేలా చూడాలని అన్నారు. ఈ నెలాఖరు వరకు ఎల్‌ఆర్‌ఎస్ రాయితీ అమలులో ఉన్న నేపథ్యంలో అర్హులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వారం రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో స్పష్టమైన ప్రగతి కనిపించాలని అన్నారు. వీడియో కాన్ఫరెనన్స్‌లో అదనపు కలెక్టర్ అంకిత్, జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనా, డీఆర్డీవో సాయాగౌడ్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్‌కుమార్, హౌసింగ్ అధికారి నివర్తి, డీఎంహెచ్‌వో రాజశ్రీ, డీసీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వన మహోత్సవానికి సమగ్ర
ప్రణాళికతో సమాయత్తం కావాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో
కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి