
నూతన కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ రూరల్: ముబారక్‌నగర్ పరిధిలోని వీవీనగర్‌లో ఉన్న సాయిబాబా ఆలయ నూతన కార్యవర్గాన్ని సభ్యులు గురువారం ఎన్నుకున్నారు. ఆలయ అధ్యక్షుడిగా రచ్చ సుదర్శన్, ఉపాధ్యక్ష, కార్యవర్గ సభ్యులు ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులను జెడ్పీ మాజీ చైర్మన్ అభినందించారు.
సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే పూజలు
నిజామాబాద్ రూరల్: ముబారక్‌నగర్ ప్రాంతంలో ఉన్న సాయిబాబా ఆలయంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులను అభినందించారు. అనంతరం ఎమ్మెల్యేను సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ రచ్చ సుదర్శన్, నాయకులు బాగిర్తి బాగారెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.