భూభారతిపై ఎన్నో ఆశలు | - | Sakshi
Sakshi News home page

భూభారతిపై ఎన్నో ఆశలు

Jun 27 2025 4:12 AM | Updated on Jun 27 2025 4:12 AM

భూభార

భూభారతిపై ఎన్నో ఆశలు

నిజామాబాద్‌

గోపాల మిత్రల గోడు పట్టదా!

పాడి పరిశ్రమలో కీలకపాత్ర పోషిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం నుంచి జీతాలు అందక ఆందోళన చెందుతున్నారు.

శుక్రవారం శ్రీ 27 శ్రీ జూన్‌ శ్రీ 2025

– 8లో u

ఐకేపీలో డీపీఎంల బదిలీలు

ముగ్గురికి స్థాన చలనం

డొంకేశ్వర్‌(ఆర్మూర్‌) : గ్రామీణ పేదరిక ని ర్మూలన సంస్థ (సెర్ప్‌)లో జిల్లా ప్రాజెక్టు మే నేజర్ల (డీపీఎం) బదిలీలు జరిగాయి. హై దరాబాద్‌లో సెర్ప్‌ సీఈవో దివ్య దేవరాజన్‌ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన బదిలీల్లో జిల్లాకు చెందిన ముగ్గురు డీపీఎంలకు స్థానచలనం కలిగింది. శ్రీనివాస్‌, సాయిలు కా మారెడ్డి జిల్లాకు అలాగే మారుతి నిర్మల్‌ జి ల్లాకు బదిలీ అయ్యారు. జిల్లా కార్యాలయంలో పనిచేస్తున్న మరో ముగ్గురికి స్థానచల నం కలుగలేదు. అదే విధంగా ఇతర జిల్లాల నుంచి ముగ్గురు డీపీఎంలు జిల్లాకు వస్తున్నారు. అందులో మెదక్‌ నుంచి మోహన్‌, సిద్దిపేట నుంచి కిరణ్‌, నిర్మల్‌ నుంచి రాజేశ్వర్‌ ఉన్నారు. వీరు రెండు, మూడు రోజుల్లో బాధ్యతలు తీసుకోనున్నారు. అయితే, ఎవరికి ఏ సెక్షన్లు ఇవ్వాలనేది సెర్ప్‌ సీఈవోనే నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, డీపీఎంలకు ఇది వరకు ఉన్న విభాగాలు కాకుండా కొత్త విభాగాలు ఇవ్వనున్నట్లు సమాచారం.

ఎస్సారెస్పీలోకి 2,894 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

బాల్కొండ: స్థానిక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీరాంసాగర్‌ జలాశయంలోకి 2,894 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్‌ నుంచి కాకతీయ కాలు వ ద్వారా 100, మిషన్‌ భగీరథ ద్వారా 231, ఆవిరి రూపంలో 261 క్యూసెక్కుల నీరు పోతోంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు) అడుగులు కాగా గురువారం సాయంత్రానికిప్రాజెక్ట్‌లో 1064 (14.77 టీఎంసీలు) అడుగుల నీరు నిల్వ ఉందని ప్రాజెక్ట్‌ అధికారులు తెలిపారు.

నిజాంసాగర్‌లోకి ఇన్‌ఫ్లో

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండడంతో నిజాంసాగర్‌ ప్రాజెక్టులోకి 1,025 క్యూసెక్కుల ఇన్‌ఫ్లోగా వస్తున్నట్లు ప్రాజెక్టు అధికారులు గురువారం తెలిపారు. క్యాచ్‌మెంట్‌ ఏరియాతోపాటు ఎ గువన కుండపోతగా కురిసిన వర్షానికి వరద వస్తోందన్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1405 అడుగులు (17.8 టీఎంసీలు)కాగా.. ప్రస్తుతం 1392 అడుగుల (5.2 టీ ఎంసీలు) నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు 1,025 క్యూసెక్కుల నీటి ని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇద్దరు ఏఎస్సైలకు పదోన్నతి

ఖలీల్‌వాడి: నిజామాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ని ఇద్దరు ఏఎస్సైలు ఎస్సైలుగా పదోన్నతి పొందారు. రుద్రూర్‌ ఏఎస్సై రాజు, సీసీఎస్‌ ఏఎస్సై జవాన్‌ భీమ్‌రావులకు ఎస్సైలుగా ప్రమోషన్‌ రావడంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు గురువారం సీపీని కలిశారు. పోలీస్‌ క మిషనర్‌ వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్‌ సిటీ: నగర మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ కమిషనర్‌గా ఎం రవిబాబు గురువారం బాధ్యతలు చేపట్టారు. 2002లో నిజామాబాద్‌ కార్పొరేషన్‌లో డిప్యూటీ కమిషనర్‌గా రవిబాబు పనిచేశారు. బదిలీపై అమరచింతకు వెళ్లారు. తిరిగి మళ్లీ నగరానికే డిప్యూటీ కమిషనర్‌గా వచ్చారు. డీసీ రవిబాబుకు రెవెన్యూ సిబ్బంది కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

భూభారతి రెవెన్యూ సదస్సులతో తమ భూ సమస్యలు పరిష్కారమై న్యాయం జరుగుతుందని వేలాది మంది రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ నెల 3 నుంచి 20 వరకు రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన సదస్సులలో 39 వేలకు పైగా రైతులు దరఖాస్తు చేసుకున్నారు. అర్జీలు పెట్టుకున్న రైతులకు సమస్య పరిష్కారం కోసం అధికారులు నోటీసులు పంపిస్తున్నారు. వివాదాలు లేని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు. అత్యధిక దరఖాస్తులు వచ్చిన సాదాబైనామాల అంశం కోర్టులో ఉండగా, అసైన్‌మెంట్‌ భూముల విషయంలో కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది.

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌ : భూభారతి పోర్టల్‌ ద్వారా తమ భూసమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ధరణి స్థానంలో వచ్చిన భూభారతికి జిల్లాలో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 3 నుంచి 20 వరకు అన్ని రెవెన్యూ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ దరఖాస్తులు వచ్చాయి. వివిధ సమస్యలకు సంబంధించి అన్ని మండలాల్లో కలిపి 39,806 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా మిస్సింగ్‌ సర్వే నంబర్లు, పెండింగ్‌ మ్యుటేషన్లు, పేర్ల మార్పులు, అసైన్డ్‌ భూముల సమస్యలు ఇతరాలు ఉన్నాయి. మిస్సింగ్‌ సర్వే నంబర్ల విషయానికి వస్తే 6,898, పెండింగ్‌ మ్యుటేషన్లు 1,121, పేర్ల మార్పు 914, అసైన్డ్‌ భూముల సమస్యలు 494, ఇతర భూసమస్యలకు సంబంధించి 22,254 దరఖాస్తులు ఉన్నాయి. ఇదిలా ఉండగా దాబైనామాలకు సంబంధించి అన్ని మండలాల్లో కలిపి 30,442 దరఖాస్తులు రాగా ఇందులో 11,891 తిరస్కరణకు గురయ్యాయి. మరో 18,551 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. తహసీల్దార్‌, ఆర్డీవో స్థాయిలో రెండంచెల్లో దరఖాస్తులను పరిశీలిస్తారు.

న్యూస్‌రీల్‌

మూడంచెల వారీగా నోటీసులు..

దరఖాస్తుల్లో ఆయా సమస్యలకు సంబంధించి తహసీల్దారు, ఆర్డీవో, కలెక్టర్‌ల ద్వారా నోటీసులు పంపిస్తున్నారు. వీటిలో అత్యధికం తహసీల్దారు, ఆర్డీవో స్థాయిలోనే పరిష్కారం అవుతున్నాయి. ఇక తహసీల్దారు వద్ద పరిష్కారం కాకపోతే ఆర్డీవో వద్ద, ఆర్డీవో వద్ద పరిష్కారం కాకపోతే కలెక్టర్‌ వద్దకు వెళ్లే అవకాశం ఉంది. కలెక్టర్‌ వద్ద కాకపోతే ట్రిబ్యునల్‌కు వెళ్లే అవకాశం కల్పించారు.

సాదాబైనామాలు, అసైన్‌మెంట్‌ భూములకు సంబంధించి మినహా ఇతర దరఖాస్తులను వేగంగా పరిష్కరిస్తున్నట్లు అదనపు కలెక్టర్‌ కిరణ్‌కుమార్‌ తెలిపారు.

అసైన్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటైన తర్వాతే..

అసైన్‌మెంట్‌ భూముల విషయానికి వస్తే అన్ని మండలాల్లో అసైన్‌మెంట్‌ కమిటీలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్‌ రాకపోవడంతో ఈ కమిటీల ఏర్పాటు ప్రక్రియ మొదలు కాలేదు. మిగిలిన సమస్యల విషయమై వివాదాలు లేనివాటిని క్లియర్‌ చేస్తున్నారు.

పెండింగ్‌లో సాదాబైనామాల దరఖాస్తులు

సాదాబైనామాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉండడంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులను తీసేస్తే మిగిలిన వాటిని రెవెన్యూ అధికారులు పెండింగ్‌లో ఉంచారు. సాదాబైనామాల అంశం కోర్టులో పెండింగ్‌లో ఉండడంతో అధికారులు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది.

భూ సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూపులు

జిల్లాలో ఇప్పటి వరకు వచ్చిన

దరఖాస్తులు 39,806

రెండంచెల్లో పరిశీలన చేయనున్న

అధికారులు

భూభారతిపై ఎన్నో ఆశలు1
1/3

భూభారతిపై ఎన్నో ఆశలు

భూభారతిపై ఎన్నో ఆశలు2
2/3

భూభారతిపై ఎన్నో ఆశలు

భూభారతిపై ఎన్నో ఆశలు3
3/3

భూభారతిపై ఎన్నో ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement