ఈత, ఖర్జూర మొక్కలకు ప్రాధాన్యం
డొంకేశ్వర్(ఆర్మూర్) : ఈ ఏడాది చేపట్టనున్న 11వ విడత వన మహోత్సవంలో ఈత, ఖర్జూర మొక్క లు ఎక్కువగా నాటించాలని గ్రామీణాభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇందుకోసం ఆయా గ్రామ పంచాయతీల్లో ఈ రకాల మొక్కలను ఎక్కువ సంఖ్యలో పెంచుతోంది. లక్షా 50 వేల ఈత, 20 వేలకు పైగా ఖర్జూర మొక్కలు నాటేందుకు సిద్ధం ఉన్నాయి. గీత కార్మిలకు ఉపాధి కల్పించేందుకు వీటిని గ్రామాల్లో చెరువు కట్టల వెంట, ఊరి శివారు ప్రాంతాల్లో నాటనున్నారు. ఆసక్తి గల గీత కార్మికులు స్థానిక పంచా యతీ కార్యదర్శిని సంప్రదించి ఉచితంగానే ఈత, ఖర్జూర మొక్కలను తీసుకెళ్లడానికి అధికారులు అవకాశం కల్పించారు. అదే విధంగా రైతులు పొలాల్లో గట్ల వెంబడి నాటేందుకు టేకు మొక్కలను కూడా ఉచితంగా ఇవ్వనున్నారు. ఈ అవకాశాన్ని సద్విని యోగం చేసుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి సాయాగౌడ్ తెలిపారు.
వన మహోత్సవంలో నాటేందుకు
జీపీ నర్సరీల్లో పెంపకం


