అవార్డు గ్రహీతకు సన్మానం
పెర్కిట్(ఆర్మూర్): ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామానికి చెందిన కొమ్ము వినోద్ రెడ్డిని హైదరాబాద్‌లో మంగళవారం టీపీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ ఘనంగా సన్మానించారు. కొమ్ము వినోద్ రెడ్డి ఇటీవల వండర్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులను సొంతం చేసుకున్నాడు. దీంతో మధుయాష్కీ గౌడ్ ఆయనను శాలువాతో ఘనంగా సత్కరించారు.
లబ్ధిదారులకు మెరుగైన సేవలందించాలి
కామారెడ్డి టౌన్: ఆస్పత్రులకు వచ్చే ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు మెరుగైన సేవలు అందేలా చేయాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మేనేజర్ సత్యనారాయణ ఆరోగ్యశ్రీ మిత్ర, సిబ్బందికి సూచించారు. జిల్లా కేంద్రంలోని జీజీహెచ్ ఆస్పత్రిలో మంగళవారం ఆరోగ్యశ్రీ సేవలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారులకు నిరంతరం సేవలు అందించేలా చూడాలన్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా టీం లీడర్లు అల్లావుద్దీన్, యశ్వంత్, ఆరోగ్య మిత్రలు పాల్గొన్నారు.
క్రీడాకారులకు అభినందన
సుభాష్‌నగర్: హన్మకొండలో ఈ నెల 12 నుంచి 14 వరకు జరిగిన ఇంటర్ సర్కిల్ విద్యుత్ కబడ్డీ, బాల్ బ్యాడ్మింటన్ టోర్నీలో తృతీయ స్థానం సాధించిన జిల్లా జట్టు క్రీడాకారులను ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ ఆర్ రవీందర్ మంగళవారం నగరంలోని పవర్ హౌస్ మీటింగ్ హాల్‌లో అభినందించారు. భవిష్యత్‌లో మొదటిస్థానంలో నిలవాలని, అందుకు అవసరమైన సహకారం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ తోట రాజశేఖర్, ఏఏవో గంగారాం, జేఏవో పూదరి గంగాధర్, సెక్రటరీ ఏ గోపి, కోశాధికారి వీ ఉత్తమ్‌సింగ్, దినేశ్, కేఎస్‌ఆర్ మూర్తి, కబడ్డీ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.
దళితరత్న అవార్డుల ప్రదానం
నిజామాబాద్‌నాగారం: జిల్లాకు చెందిన పలువురు మంగళవారం దళితరత్న అవార్డులను అందుకున్నారు. హైదరాబాద్‌లోని సూర్యలోక్ కాంప్లెక్స్‌లో రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో మాలలకు జరిగిన అన్యాయాలు, మాల జాతి అభివృద్ధిపై రాష్ట్ర నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో అంబేడ్కర్ జయంతి ఉత్సవాల కమిటీ చైర్మన్ చెరుకు రామచందర్, సక్కి గంగాధర్, మందాల భాస్కర్, బీర రాజేశ్వర్, రావుల అంజన్న పాల్గొన్నారు. సమావేశం అనంతరం నిజామాబాద్ జిల్లాకు చెందిన గోపు మోహన్, ధోడ చంద్రకాంత్, మర్రి కిరణ్ కుమార్, పెద్దోళ్ల పోశెట్టిలు చేసిన సేవలను గుర్తించి దళిత రత్న అవార్డులను ప్రదానం చేశారు.
అవార్డు గ్రహీతకు సన్మానం
అవార్డు గ్రహీతకు సన్మానం
అవార్డు గ్రహీతకు సన్మానం


