రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
● రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి
డిచ్‌పల్లి: రైతు సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం క ట్టుబడి ఉందని, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం రైతు ల కోసం రూ.లక్ష కోట్టు ఖర్చు పెట్టిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రైతు వేదికల్లో ప్రారంభమైన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో భాగంగా డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లి రైతువేదిక లో ఎమ్మెల్యే భూపతిరెడ్డి పాల్గొని ప్రసంగించారు.ధాన్యం సేకరణలో నిజామాబాద్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలి చిందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రుణమాఫీ చేయలేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే రుణమాఫీ చేసి చూ యించిందన్నారు.గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందన్నారు. అయినా ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందన్నారు. కార్యక్రమంలో ఐడీసీఎంఎస్ మాజీ చైర్మన్ మునిపల్లి సాయిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి పి యోహాన్, ఎంపీడీవో బుక్య లింగం నాయక్, కాంగ్రెస్ నాయ కులు ధర్మాగౌడ్, నరేందర్, నరేశ్, ఏఈవోలు, సొసైటీ చైర్మన్లు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
సిరికొండలో..
సిరికొండ: మండలంలోని గడ్కోల్, పెద్ద వాల్గోట్ గ్రామాల్లో ఉన్న రైతు వేదికల్లో రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్‌స కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి నాగోరావు, తహసిల్దార్ రవీందర్రావు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాకారం రవి, ఎర్రన్న, నర్స య్య, నర్సారెడ్డి, దేగం సాయన్న, రామ్ రెడ్డి, నర్సారెడ్డి, చల్ల రాజారెడ్డి, రైతులు పాల్గొన్నారు.


