
పేదింటి బిడ్డ.. బాక్సింగ్‌లో దిట్ట
మాక్లూర్: మండలంలోని గుత్ప (మాలపల్లి)కి చెందిన రాఘవేంద్ర గతేడాది ఢిల్లీలో జరిగిన అండర్–17 విభాగం జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొని రెండో రౌండ్‌లోనే ప్రత్యర్థిని నాకౌట్‌కు పంపి విన్నర్‌కప్‌తోపాటు నగదు బహుమతులను అందుకున్నాడు. అప్పటి నుంచి రాఘవేంద్రకు బాక్సింగ్‌పై మరింత పట్టుదల పెరిగింది. ఏనాటికై నా అంతర్జాతీయ స్థాయి బాక్సర్‌గా ఎదిగి తల్లి రుణం తీర్చుకోవాలని మరింత శిక్షణ పొందుతున్నాడు. కొడుకు ఆశయం నెరవేర్చేందుకు తల్లి బాసపల్లి సుజాత పడరాని పాట్లు పడుతోంది. రాఘవేంద్రకు ఊహ తెలియక ముందే నాన్న వదిలేసి వెళ్లిపోయాడు. సుజాత ఒంటరిగానే అన్నీ తానై పెంచింది. కల్లెడి, అడవి మామిడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాంట్రాక్టు ఏఎన్‌ఎంగా పనిచేస్తూ తనకు వచ్చే కొద్దిపాటి వేతనంతో కుమారుడికి ఏలోటూ రాకుండా ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు కరీంనగర్‌లోని స్పోర్ట్ స్కూల్‌లో చదివించింది. రాఘవేంద్ర ప్రస్తుతం హైదరాబాద్‌లోని శారద కళాశాలలో ఇంటర్ చదువుతూ, సమయం దొరికినప్పుడు పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తూ బాక్సింగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. పుట్టెడు ఆర్థిక ఇబ్బందుల్లోనూ పట్టుదలతో అంతర్జాతీయ బాక్సింక్ పోటీల్లో పాల్గొని ఇండియాకు పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టాలనుకుంటున్న రాఘవేంద్రకు ఉదార స్వభావులు, ప్రభుత్వం ముందుకు వచ్చి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
జాతీయస్థాయి పోటీల్లో
రాణిస్తున్న యువకుడు
ఉదార స్వభావులు, ప్రభుత్వం
చేయూతనిస్తే అంతర్జాతీయ
బాక్సర్‌ను చేస్తానంటున్న తల్లి
ఓ పేదింటి బిడ్డ పోరాట క్రీడ బాక్సింగ్‌లో పట్టుదలతో రాణిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులను అధిగమిస్తూ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని అందరి మన్ననలు పొందుతున్నాడు.
ఆర్థిక సహాయం అందించాలి
అంతర్జాతీయ బాక్సర్ కావా లన్న పట్టుదలతో ఉన్న రాఘవేంద్రకు ప్రభుత్వం తగిన సహకారం అందించాలి. తండ్రిలేని రాఘవేంద్రకు తల్లి సుజాత కష్టపడడంతోపాటు అప్పులు చేస్తూ బాక్సింగ్ శిక్షణ ఇప్పిస్తుంది. ఇప్పటికే ఓసారి జాతీయ స్థాయి బాక్సింగ్‌లో విన్నర్ అయ్యాడు. –గంట చిన్నయ్య,మాజీ సర్పంచ్, గుత్ప

పేదింటి బిడ్డ.. బాక్సింగ్‌లో దిట్ట

పేదింటి బిడ్డ.. బాక్సింగ్‌లో దిట్ట