
భూ తగాదాలో మహిళ..
నిజాంసాగర్(జుక్కల్): భూ తగాదాలో ఓ మహి ళ దారుణ హత్యకు గురైన ఘటన జుక్కల్ మండలం హంగర్గ గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. ఎస్సై భువనేశ్వర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన అన్నదమ్ము లు జాదవ్‌రావ్ సాబ్ పటేల్, పండిత్ రావు మధ్య కొన్నిరోజులుగా భూ వివాదాలు కొనసాగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం జాదవ్ రావ్ సాబ్ వేసిన జొన్న చేనును పండిత్‌రావు కొడుకు బాలాజీరావ్ కోస్తుండగా రావ్ సాబ్ భార్య జా దవ్ లక్ష్మీబాయి(45) అడ్డుకున్నది. భూమి తమ దంటే తమదని ఇరుకుటుంబాల వారు వాగ్వాదానికి దిగారు. మాటామాటా పెరగడంతో బాలాజీరావ్.. లక్ష్మీబాయి మెడపై గొడ్డలితో నరకడంతో అక్కడికక్కడే మృతి చెందింది. దాడిలో లక్ష్మీబాయి చిన్న కొడుకు శుభంరావు కాలు, చెయి విరగడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
మహిళ దారుణ హత్య
నందిపేట్(ఆర్మూర్): నిర్మానుష్య ప్రాంతంలో మహిళను హత్య చేసిన ఘటన నందిపేట మండలంలోని అయిలాపూర్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నందిపేట మండలంలోని శాపూర్ గ్రామానికి చెందిన సాదా సుమలత (42) 20 సంవత్సరాల క్రితం భర్త చనిపోవడంతో కూలీ పని చేసుకుంటూ తన కుమారుడితో కలిసి జీవిస్తుంది. సోమవారం మధ్యాహ్నం నందిపేట మండలంలోని సీహెచ్ కొండూర్ గ్రామంలో బంధువుల ఇంట్లో తొట్లె ఫంక్షన్‌కు వెళ్లిన తర్వాత అక్కడి నుంచి నందిపేట వారాంతపు సంతకు వెళ్లి కూరగాయలు తీసుకొని వస్తానని చెప్పి ఇంటి నుంచి బయలుదేరింది. రాత్రి అయినా సుమలత ఇంటికి రాకపోవడంతో కొడుకు సాదా సంజయ్, బంధువులు కలిసి చుట్టు పక్కల వెతికారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం ఉదయం అయిలాపూర్ శివారులోని గుత్ప లిఫ్ట్ కాలువ పక్కన పొలం పనుల నిమిత్తం ఎర్రటి రవి వెళ్లగా బండరాళ్ల వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి వెళ్లి సాదా సుమలతగా గుర్తించారు.
అత్యాచారం చేసి..
సాదా సుమలతను తెలిసిన వ్యక్తులే నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువచ్చి మద్యం సేవించిన అనంతరం అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా స్థలానికి ఆర్మూర్ రూరల్ సీఐ శ్రీధర్‌రెడ్డి, క్లూస్ టీం బృందం చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహం పక్కన మద్యం బాటిల్‌తోపాటు గ్లాసులు, వాటర్ బాటిల్ ఉన్నాయి. ఉరి వేసి చంపినట్లు మృతురాలి మెడకు గాట్లు ఏర్పడ్డాయి. పక్కనే వైరు తాడు సైతం పడేసి ఉంది. డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టగా.. అది నందిపేటలోని వివేకానంద చౌరస్తా వద్దకు వచ్చి ఆగిపోయింది. మృతురాలి కొడుకు సంజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
అత్యాచారం చేసి
అంతమొందించినట్లు అనుమానం

భూ తగాదాలో మహిళ..

భూ తగాదాలో మహిళ..