సమయం దొరికే ఫోన్‌లో మాట్లాడుతున్నాడు
పాకిస్తాన్‌తో జరుగుతున్న యుద్ధంలో నా కుమారుడు సాయికుమార్ పాల్గొనటం గర్వంగా అ న్పిస్తుంది. ఇంకో వైపు ఎ ప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంటుంది. రోజూ యుద్ధంలో ఏం జరుగుతుంద నేది టీవీ చూస్తునే ఉంటాను. నా కుమారుడు సమయం దొరికినప్పుడు ఫోన్‌లో మాట్లాడుతాడు. అక్కడ అంతా బాగానే ఉందని చెప్పు తాడు. ఏది ఏమైన యుద్ధంలో పాల్గొనటం నా కుమారుడు సాయికుమార్‌కు లభించిన అదృష్టంగా అనుకుంటాను.
– జయ
(ఆర్మీ మ్యాన్ సాయికుమార్ తల్లి)


