
సీఎం తన వైఖరి మార్చుకోవాలి
నిజామాబాద్ అర్బన్: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులపై చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని వెంటనే తన వైఖరి మా ర్చుకోవాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పీఆర్టీయూ భవన్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యాయులు జమ చేసుకున్న జీపీఎఫ్ డబ్బులను వెంటనే విడుదల చేయాలన్నారు. సరెండర్ బిల్లులు, మెడికల్ రియింబర్స్‌మెంట్ బిల్లులు, సప్లిమెంటరీ బిల్లులు గత రెండు సంవత్సరాల నుంచి రావడం లేదని, దీంతో అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వెంటనే పెండింగ్ డీఏలను అని మంజూరు చేయాలన్నారు. జిల్లా ప్రతినిధులు కిషన్, గంట అశోక్, శ్రీనివాస్, సాయిరెడ్డి, నగే ష్‌రెడ్డి, గోపి, హరిప్రసాద్, రవినాయక్, లక్ష్మణ్‌సాయి, నరేష్, మైఖేల్, మోహన్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.