నగరంలో పోలీసుల తనిఖీలు
ఖలీల్‌వాడి: నగరంలోని ధర్మపురి హిల్స్‌లో మంగళవారం రాత్రి ఆరో టౌన్ పోలీసులు క మ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్‌లో భాగంగా త నిఖీలు నిర్వహించారు. అనుమానితుల ఇళ్ల ను, రౌడీషీటర్ల ఇళ్లను చెక్ చేశారు. వాహనాలకు సరైన పత్రాలు, నంబర్ ప్లేట్లు, వితౌట్ నెంబర్ ప్లేట్లు లేని 26 ఆటోలు, 42 మోటార్ సైకిళ్లను సీజ్ చేశారు. అనంతరం నిజామాబా ద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కాలనీలో అనుమానాస్పదంగా ఎవరైనా తిరుగుతున్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. యువత చెడు వ్యసనాల కు దూరంగా ఉండాలన్నారు. సీఐలు సురేష్ కుమార్, రఘుపతి, శ్రీనివాసరాజు, శ్రీనివా స్, విమెన్ పీఎస్ సీఐ శ్రీలత, డిచ్ పల్లి సీఐ మల్లేష్, ధర్పల్లి సీఐ భిక్షపతి, ఎస్సైలు, సి బ్బంది పాల్గొన్నారు.


