● బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి
మోర్తాడ్(బాల్కొండ): నిరుద్యోగ యు వతీయువకులకు స్వయం ఉపాధి కో సం మెరుగైన శిక్షణ ఇవ్వడానికి నిర్దేశించిన న్యాక్ సెంటర్ భవన నిర్మాణం పనులు కొనసాగేలా చూడాలని బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం అసెంబ్లీలో ఆర్‌అండ్‌బీ, టూరిజం, దేవాదాయ, క్రీడాశాఖల పద్దులపై జరిగిన చర్చలో ఆయన వివిధ అంశాలను సభ దృష్టికి తీసుకవెళ్లారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఎస్సారెస్పీ నుంచి బాసర వరకూ బోట్ సౌకర్యం ఏర్పాటు చేయాలని కోరారు. బిల్లులు మంజూరు కాకపోవడంతో ఆలయాల నిర్మాణం పెండింగ్‌లో ఉందని వెంటనే బిల్లులు మంజూరి చేయాలని కోరారు.