నిజామాబాద్‌అర్బన్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయడం సరికాదని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని ఐటీఐ కళాశాల ఎదుట సీఎం రేవంత్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి రాచకొండ విఘ్నేశ్ మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పోరాటాలు, నినాదాలు చేయొద్దని రిజిస్ట్రార్ చే జీవో జారీ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. ఈ జీవోను వెనక్కి తీసుకోవాలని పోరాటాలు చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులపై కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేయడం దారుణమని అన్నారు. కార్యక్రమంలో దినేశ్, రాజు, వికాస్, సాయి, రోహిత్, నరేశ్, లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ యూనివర్సిటీలో..
తెయూ(డిచ్‌పల్లి): హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల అమ్మకం నిర్ణయా న్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బి శివ డిమాండ్ చేశా రు. తెలంగాణ యూనివర్సిటీ ఏబీవీపీ శాఖ ఆధ్వర్యంలో క్యాంపస్ కళాశాల వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజాపాలన అని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొనఊపిరితో ఉన్న విద్యారంగాన్ని పూర్తిగా నాశనం చే స్తోందన్నారు. అధికారంలోకి వచ్చిన 15 నెలల్లోనే అంబేడ్కర్, ఉస్మానియా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములను వే లం వేయాలని చూడటం సిగ్గు చేటన్నారు. కార్యక్రమంలో నాయకులు సాయికుమార్, మోహన్, నా యకులు సమీర్, రోహన్, నవీన్, సాయికుమార్, అనిత, నవీన, విద్యార్థులు పాల్గొన్నారు.
హెచ్‌సీయూ భూముల విక్రయాన్ని నిలిపివేయాలి