నేడు ఇసుక డంపుల వేలం | - | Sakshi
Sakshi News home page

నేడు ఇసుక డంపుల వేలం

Mar 17 2025 10:54 AM | Updated on Mar 17 2025 10:48 AM

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండలంలోని మర్‌పల్లి గ్రామంలో సీజ్‌ చేసిన ఇసుక డంపులకు సోమవారం వేలంపాట నిర్వహించనున్నట్లు తహసీల్దార్‌ భిక్షపతి ఒక ప్రకటనలో తెలిపారు. మండలానికి సంబందించిన వ్యక్తులు వేలంలో పాల్గొనాలని ఆయన కోరారు.

ప్రమాదకరంగా ప్రయాణం

బాల్కొండ: మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్దగల జాతీయ రహదారి 44పై ఆదివారం ఓ లారీ రాంగ్‌రూట్‌లో వస్తుండటంతో ‘సాక్షి’ క్లిక్‌మనిపించింది. గతంలో అనేక మార్లు ఈ చోటనే రోడ్డు ప్రమాదాలు సంభవించాయి. అయినా రాంగ్‌రూట్‌లో వాహనాలు వస్తున్న హైవే అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి రాంగ్‌రూట్‌లో వాహనాలు రాకుండా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.

అలీసాగర్‌లో మడ్‌బాత్‌

ఎడపల్లి(బోధన్‌): మండలంలోని అలీసాగర్‌ రిజర్వాయర్‌ వద్ద ఆదివారం యోగా గురువు ప్రభాకర్‌ ఆధ్వర్యంలో మడ్‌బాత్‌ (మట్టిస్నానం) నిర్వహించారు. నవీపేట, నందిపేట, నిజామాబాద్‌, ఆర్మూర్‌, బోధన్‌, ఎడపల్లి, మోస్రా, బాన్సువాడ యోగా కేంద్రాల నుంచి సుమారు 400 మంది యోగా సాధకులు ఈ మడ్‌బాత్‌లో పాల్గొన్నారు. యోగా రత్న ప్రభాకర్‌ మాట్లాడుతూ.. మడ్‌బాత్‌ ఆర్యోగానికి మంచిదన్నారు. అనంతరం యజ్ఞం నిర్వహించారు.

ప్రత్యేక బస్సులతో

ఆర్టీసీకి ఆదాయం

ఆర్మూర్‌ టౌన్‌: ఆర్మూర్‌ డిపో నుంచి ఇటీవల నడిపిన ప్రత్యేక బస్సుల ద్వారా భారీగా ఆదాయం సమకూరింది. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి జాతరను పురస్కరించుకుని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆర్మూర్‌ డిపో నుంచి ఈ నెల 12నుంచి 15వరకు ప్రత్యేక బస్సులు నడిపినట్లు డిపో మేనేజర్‌ రవికుమార్‌ తెలిపారు. మొత్తం 20 బస్సులు రోజుకు రెండు ట్రిప్పుల చొప్పున నడిచాయి. దీంతో సుమారు రూ. 25లక్షల ఆదాయం సమకూరింది. అలాగే ఇటీవలే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా వేములవాడకు 78 ప్రత్యేక బస్సులను నడిపించామని, అందులో ఆర్టీసీకి రూ. 20లక్షల ఆదాయం సమకూరిందన్నారు.

‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ చరిత్రాత్మక నిర్ణయం

సుభాష్‌నగర్‌: దేశ అభివృద్ధి కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంస్కరణల్లో మరో చరిత్రాత్మక నిర్ణయం ‘ఒకే దేశం–ఒకే ఎన్నిక’ అని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని బీజేపీ కార్యాలయంలో ఆదివారం ‘వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’ వర్క్‌షాప్‌ ఏర్పాటుచేశారు. ఈసందర్భంగా ధన్‌పాల్‌ మాట్లాడుతూ.. ప్రతిసారి ఎన్నికల కోసం రూ.వేల కోట్ల ప్రజాధనం ఖర్చవుతుందన్నారు. తరచూ జరిగే ఎన్నికల వల్ల అభివృద్ధి పనులకు అంతరాయం ఏర్పడుతుందన్నారు. ‘వన్‌ నేషన్‌–వన్‌ ఎలక్షన్‌’ ద్వారా ప్రజాధనం ఆదా అవడంతోపాటు అభివృద్ధి పనులు వేగంగా అమలు చేయవచ్చన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికలు ఒకేసారి జరగడం వల్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం మెరుగుపడుతుందన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్‌ కులాచారి, జిల్లా ఉపాధ్యక్షుడు నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు కంచెట్టి గంగాధర్‌, నక్క రాజేశ్వర్‌, లక్ష్మీనారాయణ, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నేడు ఇసుక డంపుల వేలం 
1
1/2

నేడు ఇసుక డంపుల వేలం

నేడు ఇసుక డంపుల వేలం 
2
2/2

నేడు ఇసుక డంపుల వేలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement