● ఒకరి మృతి, నలుగురికి గాయాలు
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఓ కారు అతివేగంగా వచ్చి బైక్, కంటెయినర్‌ను ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా నలుగురు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా.. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇషాద్, కర్ణల్ ఉపాధి నిమిత్తం భీమ్‌గల్‌కు వచ్చారు. తమ స్నేహితులు ఆర్మూర్ నుంచి యూపీకి వెళుతుండగా కలవాలనుకున్నారు. దీంతో శనివారం రాత్రి ఇద్దరు కలిసి బైక్‌పై బయలుదేరగా, మార్గమధ్యలో పెర్కిట్‌లో ఉన్న మరో స్నేహితుడు మనీష్‌ను ఎక్కించుకుని వెళ్లారు. ఆర్మూర్‌లోని హైవే పైగల మహిళా ప్రాంగణం వద్ద వీరి బైక్‌ను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. అనంతరం ఆగిఉన్న కంటెయినర్‌ను ఢీకొట్టింది. ఈఘటనలో ఇషాద్ అక్కడికక్కడే మృతిచెందగా బైక్‌పై ఉన్న మరో ఇద్దరు కర్ణల్, మనీష్, కారులోని రాహుల్, గణేష్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. మృతదేహాన్ని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.మృతుడి బావ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు.