ఖలీల్‌వాడి: నకిలీ గల్ఫ్ ఏజెంట్లను న మ్మి మోసపోవద్దని పోలీస్ కమిషనర్ పోతరాజు సాయిచైతన్య శనివారం ఒ క ప్రకటనలో సూచించారు. గల్ఫ్‌లో ఉపాధి అవకాశాల పేరిట మాయమాటలు చెబుతూ చాలా మంది ఏజెంట్లు అనధికారికంగా చలామణి అవుతున్నారని, దీంతో అమాయకులు మోసపోతున్నారని పేర్కొన్నారు. ప్రజలు గల్ఫ్ ఏజెంట్ల కు తమ ఇళ్లను అద్దెకు ఇవ్వొద్దని, ఒక వేళ ఇస్తే పోలీసులకు ముందస్తు సమాచారం అందించాలని సూ చించారు. అలాగే రద్దీ ప్రాంతాలు పార్కులు, ఐలాండ్, ప్రభుత్వ భవనాలు వంటి ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయొద్దని, విగ్రహాల ఏర్పాటుకు కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అ నుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు. 500 మందితో కూడిన సమావేశాలు, సభలకు ఏసీపీ అనుమతి తప్పనిసరి అని, రాత్రి 10 నుంచి ఉదయం 6గంట ల వరకు డీజే సౌండ్ సిస్టంపై పూర్తి ని షేధం ఉంటుందని తెలిపారు. ఈ ని బంధనలు ఈనెల 16 నుంచి 31వరకు ఉంటాయన్నారు. డ్రోన్‌లతో జనజీవనానికి, శాంతి భద్రతలకు విఘాతం వాటిల్లితుందని, ప్రభుత్వ సంస్థలు, పోలీసులు, ఏవియేషన్ అధికారుల నుంచి క్లియరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.